Nirmal Kapoor Passes Away at 90: Janhvi Kapoor's Grandmother and Matriarch of the Kapoor Family
Nirmal Kapoor, mother of Anil, Boney, and Sanjay Kapoor, passed away at 90 in Mumbai. Janhvi Kapoor and family members gathered to pay their last respects.

బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ దేశవ్యాప్తంగా ఆడియన్స్ అందరికీ ఎంతో సుపరిచితం. నటుడిగా కెరీర్ పరంగా ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించి ఆడియన్స్ ని తన ఆకట్టుకునే నటనతో అలరించి ఎన్నో సక్సెస్ లు సొంతం చేసుకున్నారు అనిల్ కపూర్. తెలుగులో వంశవృక్షం అనే మూవీ కూడా చేసి తెలుగు ఆడియన్స్ ని కూడా ఆకట్టుకున్నారు అనిల్ కపూర్.
నిర్మల్ కపూర్ మృతి: జాన్వీ కపూర్ తాతయ్యకు నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు
ఇక ఆయన కుమార్తె సోనమ్ కపూర్ కూడా హీరోయిన్ గా బాలీవుడ్ లో ఇటీవల పలు సినిమాలు చేసి విజయాలు అందుకున్నారు. నటిగా తన ఆకట్టుకునే అందం, అభినయంతో అలరించిన సోనమ్ కపూర్ ప్రస్తుతం కూడా మంచి కథలు దొరికితే అక్కడక్కడా సినిమాలు చేస్తున్నారు.
ఇక అనిల్ కపూర్ సోదరుడు బోనీ కపూర్ బాలీవుడ్ లో నిర్మాతగా పలు విజయవంతమైన సినిమాలు చేసి పలు విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు. ఒకప్పటి మాజీ స్టార్ హీరోయిన్ శ్రీదేవి భర్తగా మరింత పేరు అందుకున్నారు బోనీ కపూర్. ఇక ప్రస్తుతం బోనీ కపూర్, శ్రీదేవి ల కుమార్తెలు ఖుషి కపూర్, జాన్వీ కపూర్ ఇద్దరూ కూడా నటీమణులుగా మంచి క్రేజ్ సొంతం చేసుకుంటూ కొనసాగుతున్నారు.
అనిల్ కపూర్ నివాసంలో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సందర్శన
వారిలో జాన్వీ కపూర్ హిందీతో పాటు సౌత్ లో కూడా స్టార్ నటిగా భారీ సినిమాలు చేస్తూ ముందుకి సాగుతున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే, అనిల్ కపూర్, బోనీ కపూర్, సంజయ్ కపూర్ ల తల్లి అయిన నిర్మల్ కపూర్ నేడు కొద్దిసేపటి క్రితం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
90 ఏళ్ళ వయసు గల నిర్మల్ కపూర్ కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు. తాజాగా ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయి అంబానీ ఆసుపత్రిలో నేడు ఆమె మృతి చెందడంతో ఒక్కసారి కపూర్ ల ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది.
ఆమె భర్త సురీందర్ కపూర్ బాలీవుడ్ ప్రముఖ నిర్మాతగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. అనంతరం వారి కుటుంబం ఆల్మోస్ట్ అందరూ సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు. కాగా కొన్నేళ్ల క్రితం సురీందర్ కపూర్ మరణించిన విషయం తెలిసిందే.
అయితే ముగ్గురు కుమారులతో పాటు రీనా కపూర్ అనే కుమార్తె కూడా ఆమెకు ఉన్నారు. కాగా నిర్మల్ కపూర్ హఠాన్మరణం వార్త విన్న పలువురు సినీ ప్రముఖులు వారి కుటుంబానికి సంతాపం ప్రకటిస్తూ సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
నిర్మల్ కపూర్ జీవిత విశేషాలు: కుటుంబ వారసత్వం, సినీ ప్రపంచంలో పాత్ర
మరోవైపు తల్లి మరణ విషయం తెలుసుకున్న బోనీ కపూర్ తన కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్, శిఖర్ పహారియా, షనాయా కపూర్ లతో కలిసి ముంబై లోఖండ్ వాలా ఏరియాలో గల తన సోదరుడు అనిల్ కపూర్ ఇంటికి చేరుకున్నారు.
మరోవైపు సోనం కపూర్ తో పాటు ఇతర కపూర్ కుటుంబసభ్యులు అందరూ కూడా వారి ఇంటికి బాధాతప్త హృదయంతో ఒక్కొరొక్కరుగా చేరుకుంటున్నారు. ఇక గత ఏడాది తమ తల్లి నిర్మల్ కపూర్ 90వ జన్మదిన వేడుకల్ని వారి కుటుంబం మొత్తం కూడా ఎంతో వేడుకగా జరుపుకున్న విషయం తెలిసిందే.
What's Your Reaction?






