Tollywood Film News: Trending Telugu Movie Updates
Check out the latest Tollywood film news, movie updates, trailers, and celebrity stories. Daily updates only on Telugu Movie Media entertainment portal

ఇటీవల కరోనా తరువాత సినిమా ఆడియన్స్ యొక్క ఆలోచనలు చాలావరకు మారాయి. ముఖ్యంగా ఇటీవల వచ్చిన తెలుగు సినిమాల్లో మంచి కథ, కథనాలు కలిగిన సినిమాలకు ఆడియన్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలానే ఆ తరువాత వచ్చిన ఓటిటి మాధ్యమాలు మన జీవితాల్లో ప్రధాన భాగం అయిపోయాయి. ముఖ్యంగా అటు థియేటర్స్ లో సినిమాలు చూస్తున్నప్పటికీ కూడా అందరూ ఓటిటి రిలీజ్ ల కోసం కూడా ఎప్పటికప్పుడు ఎదురుచూస్తుంటారు. ఆ విధంగా ఓటిటి మాధ్యమాలు దూసుకెళ్తున్నాయి.
ఇక కొన్నేళ్ల క్రితం రాజమౌళి తీసిన బాహుబలి 1, బాహుబలి 2 తరువాత తెలుగు సినిమా యొక్క స్థాయి హాలీవుడ్ రేంజ్ కి వెళ్లిపోయింది. అక్కడ నుండి వచ్చిన అనేక తెలుగు పాన్ ఇండియన్ సినిమాలు భారీ విజయాలు సొంతం చేసుకుని మన దేశంతో పాటు వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని ఆకట్టుకుని కొనసాగుతున్నాయి. కాగా ఈ ఏడాది ఇప్పటికే పలు సినిమాలు ఆడియన్స్ ముందుకి రాగా త్వరలో మరికొన్ని మన ముందుకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అవి ఏంటి అనేది పూర్తిగా వివరాలు చూద్దాం.
SSMB 29
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఇప్పటికే పదిహేను శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. దీనిని ప్రియాంక చోప్రా (Priyanka Chopra)తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కీలక పాత్రలు చేస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ సంస్థ పై కేఎల్ నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా వి విజయేంద్ర ప్రసాద్ కథని అందించారు. ఈ మూవీ 2027 సమ్మర్ కి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
టాలీవుడ్ ఫిలిం న్యూస్ – రోజువారీ సమాచారం
They Call Him OG
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈమూవీలో ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటిస్తుండగా ఈ పాన్ ఇండియన్ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఇమ్రాన్ హష్మీ విలన్ గా చేస్తున్న ఈమూవీకి ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ మూవీలో గ్యాంగ్ స్టర్ పాత్ర చేస్తుండగా దీనిని ఈ ఏడాది సెప్టెంబర్ 25న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది.
Dragon Ntr Neel Movie
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ డ్రాగన్ (Dragon). ఈ మూవీని రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రలో మలయాళ నటుడు టోవినో థామస్ నటిస్తున్నట్లు టాక్. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్న ఈమూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తోంది. ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటున్న డ్రాగన్ మూవీ 2026 జూన్ 25 భారీ స్థాయిలో ఆడియన్స్ ముందుకి రానుంది.
Peddi
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా బుచ్చి బాబు సన దర్శకత్వలో తెరకెక్కుతున్న లేటెస్ట్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ మూవీ పెద్ది. ఈ మూవీలో కన్నడ స్టార్ యాక్టర్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తుండగా మీర్జాపూర్ (Mirzapur) ఫేమ్ దివ్యేందు (Divyenndu) మరొక ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఏ ఆర్ రహమాన్ సంగీతం సమకూరుస్తున్న ఈమూవీని సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ వారితో కలిసి వ్రిద్ది సినిమాస్ సంస్థ పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీనిని 2026 సమ్మర్ కానుకగా మార్చి 27 న విడుదల చేయనున్నారు.
AA 22
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా అట్లీ కుమార్ దర్శకత్వంలో తాజాగా ఒక భారీ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేస్తుండగా హీరోయిన్స్ గా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), దీపికా పదుకొనె (Deepika Padukone), జాన్వీ కపూర్ నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ పై గ్రాండ్ లెవెల్లో నిర్మితం అవుతున్న ఈ మూవీకి సాయి అభ్యంకర్, హాన్స్ జిమ్మర్ సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ ప్రతిష్టాత్మక మూవీ 2026 చివర్లో రిలీజ్ కానుంది.
The Rajasaab
ప్రభాస్ (Prabhas) హీరోగా రిద్ది కుమార్ (Riddhi Kumar), మాళవిక మోహనన్ (Malavika Mohanan), నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ హర్రర్ కామెడీ యాక్షన్ మూవీ ది రాజాసాబ్. ఈ మూవీని మారుతీ తెరకెక్కిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీ పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీ చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి ఈ ఏడాదిలోనే ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.
షూటింగ్ అప్డేట్స్ మరియు రిలీజ్ డేట్స్
Kingdom
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా భాగ్యశ్రీ బోర్సే (Bhagyasri Borse) హీరోయిన్ సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ కింగ్డమ్ (Kingdom). ఈ మూవీలో సత్యదేవ్ ఒక కీలక పాత్ర చేస్తుండగా గౌతమ్ తిన్ననూరి దీనిని తెరకెక్కిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతమ్స్ సమకూరుస్తున్న ఈమూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ అందరినీ ఆకట్టుకుని మంచి అంచనాలు ఏర్పరిచింది. కాగా కింగ్డమ్ మూవీ జులై 5న పాన్ ఇండియన్ రేంజ్ లో పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.
Kannappa
మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫాంటసీ యాక్షన్ మూవీ కన్నప్ప. ఈ మూవీని ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తుండగా ఏ వి ఏ ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థల పై స్వయంగా విష్ణు నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), ప్రభాస్, శరత్ కుమార్, మోహన్ లాల్ (Mohanlal), అక్షయ్ కుమార్ (Akshay Kumar), మోహన్ బాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ మూవీలో ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) హీరోయిన్ గా నటిస్తున్నారు. స్టీఫెన్ దేవసి సంగీతం అందిస్తున్న ఈమూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. కాగా కన్నప్ప మూవీ జూన్ 27న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.
The Paradise
నాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ ది ప్యారడైజ్ (The Paradise). ఈ మూవీ పై నాని ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. గతంలో శ్రీకాంత్, నాని ల కాంబినేషన్ లో వచ్చిన మాస్ యాక్షన్ మూవీ దసరా పెద్ద విజయం అందుకోవడంతో తప్పకుండా ఇది కూడా సక్సెస్ ఖాయం అని అందరూ భావిస్తున్నారు. ఈ మూవీకి అనిరుద్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తుండగా హిందీ నటి సోనాలి కులకర్ణి ఇందులో నాని తల్లిగా నటించనున్నట్టు టాక్. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంస్థ పై సుధాకర్ చేరుకూరి గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈమూవీ దాదాపుగా రూ. 150 కోట్ల భారీ వ్యయంతో రూపొందుతుండగా దీనిని 2026 మార్చి 26న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్సు ముందుకి తీసుకురానున్నారు.
ట్రెండింగ్ మూవీస్ & సెలెబ్రిటీ న్యూస్
Vishwambhara
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ మూవీ విశ్వంభర. ఈ మూవీలో త్రిష (Trisha Krishnan) హీరోయిన్ గా నటిస్తుండగా కునాల్ కపూర్ విలన్ పాత్ర చేస్తున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న విశ్వంభర మూవీని యువి క్రియేషన్స్ సంస్థ పై వంశీ కృష్ణా రెడ్డి, విక్రమ్ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ తో పాటు ఫస్ట్ సాంగ్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై భారీ అంచనాలు ఏర్పరిచాయి. కాగా అన్ని కార్యక్రమాలు ముగించి ఈమూవీని త్వరలో ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది.
Akhanda 2
ప్రస్తుతం నటసింహం బాలకృష్ణ (Balakrishna) తో మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను తీస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మూవీ అఖండ 2. ఈ మూవీని భారీ స్థాయిలో 14 రీల్స్ సంత పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. నాలుగేళ్ళ క్రితం ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద విజయం అందుకున్న అఖండ కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈమూవీలో సంయుక్తా మీనన్ (Samyuktha Menon) హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈమూవీలో అఘోరాగా బాలకృష్ణ పాత్ర మరింత పవర్ఫుల్ గా అద్భుతంగా ఉండనుందని టాక్. ఇక ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి సెప్టెంబర్ 25న భారీ స్థాయిలో పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
కాగా ఇటువంటి మరిన్ని తెలుగు మూవీ న్యూస్ కోసం తరచు మా Telugu Movie Media సైట్ ని ఫాలో అవుతూ ఉండండి
What's Your Reaction?






