Samantha Health Condition and Re-entry Updates
Samantha's health update and her much-awaited comeback to the Telugu film industry.

టాలీవుడ్ స్టార్ కథానాయిక సమంత రూత్ ప్రభు ఇటీవల చివరిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఖుషి మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. ఈ మూవీని శివ నిర్వాణ తెరకెక్కించగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. అనంతరం సమంత ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా మారడంతో పాటు ఆమె మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డారు.
అంతకముందు అక్కినేని నాగచైతన్య ని వివాహం చేసుకున్న సమంత, నాలుగేళ్ళ వివాహ జీవితం అనంతరం ఆయన నుండి కొన్ని కారణాల రీత్యా విడిపోయి తన కుటుంబంతో విడిగా జీవిస్తున్నారు. అయితే అక్కడి నుండి ఒకింత డిప్రెషన్ కి గురైన సమంత ఆ తరువాత కొంత అనారోగ్యానికి లోనయ్యారు. ఆ తరువాత తాను మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డానని స్వయంగా సమంత నే తన సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్ తో పంచుకున్నారు.
సమంత రీ-ఎంట్రీ పై ఆసక్తికర విషయాలు
అయితే ఆ విషయం తెలియడంతో ఆమె ఆరోగ్యం విషయమై అందరూ ఆందోళన చెందారు. కాగా తాను మెల్లగా ఆ వ్యాధి నుండి కోలుకుంటున్నానని, ప్రస్తుతం వైద్యుల నుండి మెరుగైన చికిత్స తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఇక అక్కడి నుండి తన ఆరోగ్యం విషయమై ఎప్పటికప్పుడు మరింత శ్రద్ధ తీసుకున్న సమంత, ఆపై పలు పుణ్యక్షేత్రాలని సందర్శించారు. ఇక మెల్లగా కొన్ని నెలల అనంతరం కోలుకున్న ఆమె పలు విషయాలు చెప్పారు.
తనకు విడాకుల సమయంలో మానసికంగా ఎంతో ఒత్తిడి కలిగిందని, అయితే అదే సమయంలో తన కుటుంబం, శ్రేయోభిలాషులు, అభిమానులు తనకు అండగా నిలిచి తనకు ఎప్పటికపుడు ధైర్యం అందించడం వల్లనే తాను కోలుకున్నట్లు చెప్పుకొచ్చారు సమంత. జీవితంలోని కొన్ని కీలక సమయాల్లో ఒక్కోసారి మనసు ఏంటో వేదనకు గురవుతుందని, అయితే అన్నిటికీ తట్టుకుని మెల్లగా పరిస్థితులకు అలవాటు పడి ముందుకు సాగడమే జీవితం అని ఆమె అన్నారు.
సమంత రూత్ ప్రభు ఆరోగ్యం తాజా వివరాలు
ఇక ఇటీవల అనారోగ్యం నుండి పూర్తిగా కోలుకున్న అనంతరం వరుణ్ ధావన్ హీరోగా ఆమె కథానాయికగా ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం అయిన సిరీస్ సిటాడెల్ హానీ బన్నీ. ఈ సిరీస్ బాగానే రెస్పాన్స్ అందుకుంది. అంతకముందు ప్రియాంక చోప్రా నటించిన అమెరికన్ సిరీస్ సిటాడెల్ కి ఇది ఇండియన్ వర్షన్ రీమేక్.
అయితే దీని తరువాత మా ఇంటి బంగారం అనే మూవీ చేయనున్నారు సమంత. ఈ మూవీలో ప్రియదర్శి పులికొండ కీలక పాత్ర చేయనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ టాక్. ఇక తాజాగా త్రలాలా మూవింగ్ పిక్చర్స్ సంస్థని స్థాపించి తొలిసారిగా శుభం అనే మూవీని నిర్మించారు. యువ దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈమూవీ యొక్క కథని వసంత్ మరింగంటి అందించారు.
సమంత రూత్ ప్రభు రాబోయే ప్రాజెక్టులు
ఇటీవల రిలీజ్ శుభం మూవీ ఫస్ట్ లుక్ టీజర్ అందరినీ ఆకట్టుకుని మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కామెడీ యక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో అందరూ కొత్తవారే నటిస్తున్నారు. హర్షిత్ మల్గిరెడ్డి, శ్రియ కొంతమ్, చరణ్ పేరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ త్వరలో ఆడియన్స్ ముందుకి రానుంది.
మరి తన తొలి వెంచర్ ద్వారా సమంత మంచి విజయం అందుకోవాలని కోరుకుంటూ ఆమెకు ముందస్తు విజయాభినందనలు తెలియచేస్తున్నాం. ఇక మరోవైపు తన ప్రత్యూష ఫౌండేషన్ తరపున పలు సామజిక సేవా కార్యక్రమాలు, చిన్నారులకు ఆపరేషన్స్ తో పాటు పలువురికి ఉచితంగా విద్యని కూడా ఆమె అందిస్తున్నారు. మొత్తంగా నటి, ఇటు మానవతావాదిగా మంచిపేరుతో కొనసాగుతున్నారు సమంత రూత్ ప్రభు.
What's Your Reaction?






