Huge Rumor on Pawan Kalyan's New Movie Shakes the Industry!
A major rumor about Pawan Kalyan's upcoming movie is creating a buzz. Is there any truth to it? Find out here!

టాలీవుడ్ స్టార్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తాజాగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ కలిసి తీస్తున్న మూవీ హరి హర వీర మల్లు పార్ట్ 1. ఈ మూవీలో అందాల కథానాయిక నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రి, పూజిత పొన్నాడ నటిస్తున్నారు.
Big Rumor on Pawan Kalyan's New Movie!
ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ హిస్టారికల్ ఎంటర్టైనర్ మూవీకి ఆస్కార్ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి స్వరాలు సమకూరుస్తుండగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ సీనియర్ నిర్మాత ఏ ఎం రత్నం గ్రాండ్ గా పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీని మార్చి 28న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
అయితే తాజాగా ఆ డేట్ కి సితార ఎంటర్టైన్మెంట్స్ వారి మ్యాడ్ స్క్వేర్, నితిన్ రాబిన్ హుడ్ సినిమాలు రిలీజ్ కానుండడంతో హరి హర వీర మల్లు వాయిదా పడే అవకాశం గట్టిగా కనపడుతోంది. అయితే ఈ విషయమై త్వరలో మూవీ టీమ్ నుండి అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఇక దీనితో పాటు మరోవైపు మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు యువ దర్శకుడు సుజీత్ తో ఓజి సినిమాలు కూడా చేస్తున్నారు పవన్.
ఈ రెండిటితో పాటు త్వరలో సురేందర్ రెడ్డితో కూడా ఆయన ఒక సినిమా చేయనున్నారనే న్యూస్ కూడా కొన్నాళ్లుగా వైరల్ అవుతోంది. దానికి చాలానే టైం ఉందని తెలుస్తోంది. కాగా ఉస్తాద్ భగత్ సింగ్ కొంత మేర షూటింగ్ జరుపుకున్నప్పటికీ ఓజి మూవీ మాత్రం దాదాపుగా 80 శాతానికి పైగా షూట్ కంప్లీట్ చేసుకుంది.
Sensational News Shocking Fans!
కాగా వీటిలో హరి హర వీర మల్లు అనంతరం ముందుగా ఓజి రిలీజ్ అవనుందనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. ఆర్ఆర్ఆర్ నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు గ్రాండ్ లెవెల్లో అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఓజి మూవీకి ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తుండగా అందాల నటి ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక పవన్ కు పెద్ద అభిమాని అయిన సుజీత్, ఈ మూవీని గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీగా తెరకెక్కిస్తున్నారు.
ఇటీవల ఓజి మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ కి అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ అయితే లభించింది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ పాత్రలో మూడు షేడ్స్ ఉంటాయని, ఆయన పాత్ర సినిమాలో ఎంతో పవర్ఫుల్ గా ఉండడనున్నట్లు టాక్. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఇందులో విలన్ గా చేస్తుండగా ఇతర కీలక పాత్రల్లో కోలీవుడ్ నటుడు అర్జున్ దాస్, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, విలక్షణ నటి శ్రియ రెడ్డి తదితరులు నటిస్తున్నారు.
Is This Rumor True or Fake?
ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా పవర్ స్టార్ ని ఎలా చూడాలని భావిస్తున్నారో అదే విధంగా అదిరిపోయే రేంజ్ లో దర్శకుడు సుజీత్ ఆయన పాత్రని రాసుకున్నారట. కాగా మ్యాటర్ ఏమిటంటే, లేటెస్ట్ టాలీవుడ్ రూమర్ ప్రకారం ఓజి మూవీ ఈ ఏడాది ఆగష్టు లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
ఏప్రిల్ లో ఈ మూవీలో తన పార్ట్ బ్యాలెన్స్ ఉన్న పార్ట్ షూట్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ కాల్షీట్స్ అందించనున్నారని, అక్కడి నుండి పోస్ట్ ప్రొడక్షన్ వేగంగా పూర్తి చేసి పక్కాగా మూవీని ఆగస్టు చివరిలో రిలీజ్ చేసే ఆలోచనలో టీమ్ ఉన్నట్లు టాక్.
Fans Await Official Confirmation!
వాస్తవానికి ఓజి మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27న ఆడియన్స్ ముందుకి రావాల్సి ఉంది, కానీ షూటింగ్ ఆలస్యం కారణంగా అప్పటినుండి వాయిదా పరుస్తూ వస్తోంది. మరోవైపు ఈ మూవీలోని సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అందరినీ ఎంతో ఆకట్టుకుంటాయని, తనతో పాటు టీమ్ మొత్తం కూడా ఓజి కోసం ఎంతో శ్రమపడుతున్నటు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చారు సంగీత దర్శకుడు థమన్.
What's Your Reaction?






