RC 17 Movie: Release Date, Cast, Story & Latest Updates
RC 17 movie starring Ram Charan is one of the most anticipated Telugu films. Get the latest updates on release date, cast, story, and more.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇటీవల శంకర్ తీసిన గేమ్ ఛేంజర్ మూవీ ఆడియన్స్ ముందుకి వచ్చి ఆశించిన రేంజ్ లో విజయం అందుకోలేకపోయింది. ఈ మూవీలో బాలీవుడ్ అందాల నటి కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా ముఖ్య పాత్రల్లో సీనియర్ నటుడు శ్రీకాంత్, సముద్రఖని, రాజీవ్ కనకాల, అంజలి నటించారు. మొత్తంగా అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించారు.
RC 17 Movie Release Date & Updates
కాగా వీటిలో అప్పన్న రోల్ లో ఆయన సూపర్ యాక్టింగ్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ అయితే లభించింది. ఇక గేమ్ ఛేంజర్ మూవీకి ఎస్ థమన్ సంగీతం సమకూర్చగా దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించారు. అయితే ఈ మూవీ తరువాత తాజాగా ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సన తో RC16 మూవీ చేస్తున్నారు రామ్ చరణ్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొందుతున్న ఈ మూవీ ద్వారా తొలిసారిగా బాలీవుడ్ అందాల కథానాయిక జాన్వీ కపూర్ తో జోడీ కడుతున్నారు రామ్ చరణ్.
ప్రస్తుతం కొంత మేర షూటింగ్ జరుపుకున్న ఈమూవీలో అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు కీలక పాత్ర చేస్తుండగా మరొక ముఖ్య పాత్రలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. ఇప్పటికే అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీకి ఆస్కార్ విజేత ఏ ఆర్ రహమాన్ స్వరాలు సమకూరుస్తుండగా దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియన్ రేంజ్ లో సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్ధలతో కలిసి తన వ్రిద్ది సినిమా సంస్థ పై వెంకట సతీష్ కిలారు భారీ వ్యయంతో నిర్మిస్తన్నారు.
RC 17 Movie Cast & Crew Details
ఇక ఈ మూవీలో రామ్ చరణ్ పాత్ర అద్భుతంగా రాసుకున్నారట దర్శకుడు బుచ్చిబాబు. ఇక ఉప్పెన విజయంతో అందరి నుండి మంచి పేరు సొంతం చేసుకున్న బుచ్చిబాబుకి చరణ్ రెండవ సినిమా ఛాన్స్ ఇచ్చారు అంటే స్క్రిప్ట్ లో ఎంత డెప్త్ ఉందొ అర్ధం చేసుకోవచ్చని అంటున్నాయి మెగా సన్నిహిత వర్గాలు. మరోవైపు ఈ మూవీలో వచ్చే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ అందరినీ ఆకట్టుకుంటాయని అంటున్నారు.
అలానే ఈ మూవీలోని తన పాత్ర కోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా బల్క్ గా బాడీ కూడా పెంచిన సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న RC 16 మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కాగా మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మూవీకి సంబంధించి ఆ రోజున ఒక స్పెషల్ అప్ డేట్ ప్లాన్ చేస్తున్నారట మూవీ మేకర్స్. అయితే విషయం ఏమిటంటే, మరోవైపు దీని అనంతరం ఇప్పటికే సుకుమార్ తో తన నెక్స్ట్ మూవీ అయిన RC 17 లైన్లో పెట్టారు రామ్ చరణ్. గ
తంలో సుకుమార్, చరణ్ ల కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం మూవీ ఎంత పెద్ద విజయం అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ రూరల్ యాక్షన్ డ్రామా మూవీలో సమంత రూత్ ప్రభు హీరోయిన్ గా నటించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు. అయితే విషయం ఏమిటంటే, త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న RC 17 మూవీకి ఒక యూనీక్ సబ్జెక్ట్ ని సిద్ధం చేశారట సుకుమార్.
మరోవైపు ఇటీవల ఈ మూవీలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ గురించి సుకుమార్ చెప్తే విని ఎంతో ఆశ్చర్యంగా ఎగ్జైట్ అయ్యాను, అది ఎంతో అద్బుతముగా ఉంటుంది అంటూ ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి మాట్లాడుతూ చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ కోసం స్టార్ హీరోయిన్స్ అయిన రష్మిక మందన్న, సమంత లలో ఒకరిని ఆల్మోస్ట్ ఫిక్స్ చేయనున్నారని త్వరలో వారికీ సంబంధించిన న్యూస్ కూడా అఫీషియల్ గా అనౌన్స్ కానుందట.
RC 17 Movie Story, Budget & Production News
ఇక ఈ మూవీకి కూడా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ మూవీ కోసం ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో నిమగ్నం అయిన సుకుమార్, ఎప్పుడైతే బుచ్చిబాబు మూవీ నుండి చరణ్ బయటకు వస్తారో, అప్పటి నుండి తన మూవీ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. మొత్తంగా హీరోగా రామ్ చరణ్ వరుసగా రెండు భారీ ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీగా కొనసాగుతున్నారన్నమాట. కాగా ఈ రెండు మూవీస్ భారీ విజయాలు సొంతం చేసుకుని హీరోగా రామ్ చరణ్ కు మంచి పేరు క్రేజ్ మార్కెట్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
What's Your Reaction?






