HIT 3 Review Telugu: Nani Shines in a Gritty Crime Thriller | Public Talk

HIT 3 Telugu movie review: Nani delivers a powerful performance in this intense crime thriller. Check public talk, highlights, and final verdict

HIT 3 Review Telugu: Nani Shines in a Gritty Crime Thriller | Public Talk

సినిమా పేరు : (HIT: The Third Case)

విడుదల తేదీ : 1 మే 2025

నటీనటులు : నాని, శ్రీనిధి శెట్టి, రావు రమేష్, సూర్య శ్రీనివాస్, శ్రీనాథ్ మాగంటి, సముద్రఖని, కోమలి ప్రసాద్, ప్రతీక్ బబ్బర్

దర్శకుడు : డాక్టర్ శైలేష్ కొలను 

నిర్మాతలు : నాని, ప్రశాంతి తిపిర్నేని 

సంగీతం : మిక్కీ జె మేయర్ 

సినిమాటోగ్రఫీ : సాను జాన్ వర్గేసే

రేటింగ్ : 3. 5 / 5

హిట్ 3 సినిమా సమీక్ష: నాని పాత్రలో మాస్ మాయ

టాలీవుడ్ స్టార్ యాక్టర్ నాచురల్ స్టార్ నాని హీరోగా కెజిఎఫ్ సినిమాల హీరోయిన్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా యువ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ హిట్ 3. ఈ మూవీని యూనానిమస్ ప్రొడక్షన్స్, వాల్ పోస్టర్ సినిమా సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మించగా మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. ప్రారంభం నాటి నుండి అందరిలో భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది, కథ కథనాలు ఏంటి అనేది పూర్తి స్థాయి రివ్యూస్ లో ఇప్పుడు చూద్దాం. 

కథ : 

చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన అర్జున్ సర్కార్ (Nani) అక్కడి నుండి రూత్ లెస్ గా మారిపోవడంతో పాటు ఏ విషయం అయినా సరే నిర్మొహమాటంగా మాట్లాడుతుంటాడు. ఆ విధంగా చిన్నప్పటి నుండి క్రిమినల్స్ అంటే అతనికి నచ్చదు. వారు సమాజానికి చెడు చేస్తారనే భావనతో వారు ఒక్కరు కూడా బ్రతికుండకూడదని పలువురిని తన వృత్తి రీత్యా నరకం చూపిస్తాడు అర్జున్ సర్కార్. అనంతరం ఒక డార్క్ వెబ్ సైట్ ని అడ్డం పెట్టుకుని పలువురు క్రిమినల్స్ అనేకమందిని హత్యలు చేస్తూ పోలీసులకి ఛాలెంజ్ కూడా విసురుతారు.

అయితే అటువంటి వారిని పట్టుకోవడనికి అర్జున్ సర్కార్ ఒక్కసారిగా సైకో కిల్లర్ గా మారుతాడు. అదే సమయంలో అతడికి మృదుల (Srinidhi Shetty) ఎదురుపడడం,ఆపైన ఆమెతో అతడు ప్రేమలో పడడం జరిగిపోతుంది. మరి ఇంతకీ మృదుల ఎవరు, అసలు అర్జున్ సర్కార్ ఆ డార్క్ వెబ్ సైట్ కేసుని ఏ విధంగా డీల్ చేసి క్రిమినల్స్ ని అంతమొందించాడు అనేది మొత్తం కూడా వెండితెరపై మనం చూడాల్సిందే. 

ప్లస్ పాయింట్స్ : 

వాస్తవానికి ఇటువంటి క్రైమ్ యాక్షన్ థ్రిల్లెర్స్ కి కథ తో పాటు కథనం కూడా ఆసక్తికరంగా ఉంటె చెప్పకుండా ఆడియన్స్ వీటికి ఎంగేజ్ అవుతారు. అయితే ఆ విధంగా ఆకట్టుకునే కథనం రాసుకుని ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో యువ దర్శకుడు శైలేష్ కొలను చాలావరకు సక్సెస్ అయ్యారని చెప్పాలి. ముఖ్యంగా మొదటి సీన్ నుండి అక్కడక్కడా వయొలెంట్ సీన్స్ ఉంటాయి, ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ లో అరాచకంగా అనిపిస్తాయి. అయితే హీరోగా అర్జున్ సర్కార్ పాత్రలో నాని యాక్టింగ్ నభూతో నభవిష్యతి అని చెప్పాలి.

పలు కీలక యాక్షన్ సీన్స్ లో ఆయన అదరగొట్టే పెర్ఫార్మన్స్ కనబరిచారు. ఇక హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి కూడా తన పాత్ర యొక్క పరిధి మేరకు ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆమె సీన్స్ కూడా బాగానే వచ్చాయి. ఇతర కీలక పాత్రలు చేసిన రావు రమేష్, శ్రీనాథ్ మాగంటి తో పాటు సర్ప్రైజింగ్ గా అనిపించే హీరోల క్యామియోస్ కూడా బాగున్నాయి. అయితే రొమాంటిక్ సీన్స్ మరింత బాగా రాసుకోవాల్సింది. సాంగ్స్ ఓకే, ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలక సీన్స్ లో బాగుంది. యాక్షన్ సీన్స్ కి భావోగ్వేగాలను జోడించి దర్శయుడు శైలేష్ బాగానే కథని ముందుకు తీసుకెళ్లారు. 

కథలో ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయో?

మైనస్ పాయింట్స్ : 

గ్రాండియర్ విజువల్స్, క్రైమ్, యాక్షన్ ప్రధానంగా సాగిన హిట్ 3 మూవీ మధ్యలో అక్కడక్కడా ఆకట్టుకోదు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ సాగతీసినట్లు అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అయితే సినిమా యొక్క హైప్ కి తగ్గట్లుగా లేవు. ఇక విలన్ గా చేసిన ప్రతీక్ బబ్బర్ పాత్ర బాగున్నప్పటికీ దానిని మరింత ఎఫెక్టివ్ గా హీరోని ఢీకొట్టే రేంజ్ కి మ్యాచ్ అయ్యేలా రాసుకోలేదు. సెకండ్ హాఫ్ చాలా వరకు యాక్షన్ సీన్స్ చుట్టూనే తిరుగుతుంది. 

సాంకేతిక విభాగం : 

ఇక హిట్ 3 లో ముఖ్యంగా చెప్పుకోవలసింది ఫోటోగ్రఫి అందించిన సాను జాన్ వర్గేసి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. ముఖ్యంగా విజువల్స్ మొత్తం కూడా గ్రాండియర్ గా ఉన్నాయి. యాక్షన్ సీన్స్ కూడా కథకి తగ్గట్లుగా ఆయన చిత్రీకరించిన తీరు సూపర్. ఎడిటింగ్ విభాగం కూడా బాగానే పని చేసింది.

ఇక సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ విషయానికి వస్తే సాంగ్స్ కంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పలు కీలక సీన్స్ లో బాగుంది. రచయితగా దర్శకుడిగా ఆకట్టుకునే తీరున దర్శకుడు శైలేష్ కొలను మూవీని బాగానే తెరకెక్కించారు. కథ కథనాలు బాగున్నప్పటికీ ఎక్కువగా యాక్షన్ తో పాటు సెకండ్ హాఫ్ మరింత ఇంట్రెస్టింగ్ గా రాసుకుని ఉంటె బాగుండేదనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. 

నాని పెర్ఫార్మెన్స్ పైన ప్రేక్షకుల స్పందన

తీర్పు : 

మొత్తంగా నేడు మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన హిట్ 3 మూవీ ఓవరాల్ గా అయితే మంచి ఆకట్టుకునే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. అయితే ఇది ఎక్కువగా క్రైమ్, యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి నచుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవదా కష్టం. అయినప్పటికీ ఆద్యంతం సినిమాని తన అద్భుత నటనతో నాని ఆకట్టుకున్నారు. దర్శకడు శైలేష్ కొలను కూడా సినిమాని బాగానే చిత్రీకరించారు. వీలైతే యాక్షన్ మూవీ లవర్స్ ఈ మూవీని తప్పకుండా మీ సమీప థియేటర్స్ లో మిస్ కాకుండా చూడండి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow