Top Telugu Songs for Ringtone (2025) | Best Picks for Your Mobile
Explore the latest and best Telugu songs for ringtone in 2025! Find the perfect tune for your mobile and set the trend with these top choices

తెలుగు సినిమా పరిశ్రమలో ఒకప్పటితో పోలిస్తే నేటి సినిమాలకు ముందుగా గ్లింప్స్ టీజర్స్ తో పాటు సాంగ్స్ ని ఎంతో జాగ్రత్తగా స్వరపరచి రిలీజ్ చేస్తున్నారు పలువురు మూవీ మేకర్స్.
వాస్తవానికి నేడు సినిమాల యొక్క సక్సెస్ కి చాలావరకు సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే పలువురు స్టార్స్ కూడా యువతని ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు తమ నూతన సినిమాల్లో సాంగ్స్ ఆకట్టుకునేలా ఉండేలా దగ్గరుండి మ్యూజిక్ డైరెక్టర్స్ నుండి మంచి ట్యూన్స్ రాబడుతున్నారు.
మరోవైపు నిర్మాతలు, దర్శకులు కూడా తమ సినిమాల మ్యూజిక్ విషయంలో ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆ విధంగా ప్రతి ఏడాది కూడా పలు సాంగ్స్ టాప్ లో నిలుస్తూ ఉండడంతో అవి యూట్యూబ్ సహా స్పాటిఫై వంటి మ్యూజిక్ మాద్యమాల్లో సైతం విశేషంగా ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి.
ఇక యువత అయితే ఆకట్టుకునే సాంగ్స్ ని ఎప్పటికప్పుడు ఎంతో ఆదరిస్తున్న సంగతి తెలిసిందే. ఆ విధంగా ఈ ఏడాది అనగా 2025 లో టాప్ స్థానంలో నిలిచిన తెలుగు సాంగ్స్ అండ్ తెలుగు సాంగ్ రింగ్ టోన్స్ లిస్ట్ ఏమిటనేది ఇప్పుడు చూద్దాం.
2025కి ఉత్తమ తెలుగు రింగ్‌టోన్ పాటలు
1. హైలెస్సో సాంగ్ (తండేల్)
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ మూవీలోని ఈ మెలోడియస్ సాంగ్ ని రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేయగా నకాష్ అజిజ్, శ్రేయ ఘోషల్ అద్భుతంగా పాడారు.
2. బుజ్జి తల్లి సాంగ్ (తండేల్)
నాగ చైతన్య, సైపల్లవి జంటగా నటించిన ఈ మూవీలోని ఈ మెలోడియస్ సాంగ్ ని రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేయగా ప్రముఖ గాయకుడూ జావేద్ ఆలీ అద్భుతంగా ఆలపించారు.
3. కనిమా (రెట్రో)
సూర్య, పూజ హెగ్డే జంటగా రూపొందిన రెట్రో మూవీలోని ఈ సాంగ్ ని సంతోష్ నారాయణన్ స్వరపరచగా ఆయనతో కలిసి ఈ అద్భుతమైన సాంగ్ ని ది ఇండియన్ కొరల్ ఎన్సెంబుల్ పాడారు.
4. చుట్టమల్లే (దేవర పార్ట్ 1)
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా రూపొందిన ఈ మూవీలోని ఈ సాంగ్ ని అనిరుద్ రవిచందర్ కంపోజ్ చేయగా మెలోడియస్ గా సాగె ఈ సాంగ్ ని ప్రముఖ గాయని శిల్పరావు అద్భుతంగా పాడారు.
మీ మొబైల్ కోసం ట్రెండింగ్ తెలుగు రింగ్‌టోన్ ఎంపికలు
5. చిట్టి గువ్వ (Court)
హర్ష్ రోషన్, శ్రీదేవి హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీలోని ఈ సాంగ్ ని విజయ్ బుల్గనిన్ కంపోజ్ చేయగా ఈ మెలోడియస్ సాంగ్ ని కాలభైరవ అద్భుతంగా ఆలపించారు
6. నమో నమః శివాయ (తండేల్)
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ మూవీలోని ఈ సాంగ్ ని దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా ఈ సాంగ్ ని అనురాగ్ కులకర్ణితో కలిసి హరి ప్రియ అద్భుతంగా ఆలపించారు.
7. రెప్పల్ డప్పుల్ (మిస్టర్ బచ్చన్)
రవితేజ, భాగ్యశ్రీ బోర్సే హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీలోని ఈ సాంగ్ ని మిక్కీ జె మేయర్ కంపోజ్ చేయగా అనురాగ్ కులకర్ణితో కలిసి మంగ్లీ అద్భుతంగా పాడారు.
8. కన్నడి పూవే (రెట్రో)
సూర్య, పూజా హెగ్డే హీరో హీరోయిన్స్ గా రూపొందిన ఈ మూవీలోని ఈ సాంగ్ ని సంతోష్ నారాయణన్ కంపోజ్ చేసి స్వయంగా ఎంతో అద్భుతంగ ఆలపించారు.
రింగ్‌టోన్ కోసం సరైన తెలుగు పాటను ఎలా ఎంచుకోవాలి?
9. ప్రేమలో (Court)
హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన కోర్ట్ మూవీలోని ఈ సాంగ్ ని విజయ్ బుల్గేనిన్ కంపోజ్ చేయగా అనురాగ్ కులకర్ణితో కలిసి సమీరా భరద్వాజ్ అద్భుతంగా ఆలపించారు.
10. దబిడి దిబిడి (డాకు మహారాజ్)
నందమూరి బాలకృష్ణ, ప్రగ్య జైస్వాల్ జంటగా నటించిన ఈ మూవీలోని ఈ మాస్ సాంగ్ ని ఎస్ థమన్ కంపోజ్ చేసి వాగ్దేవితో కలిసి స్వయంగా ఎంతో చక్కగా ఆలపించారు.
మొత్తంగా తాజాగా ట్రెండింగ్ లో ఉన్న టాప్ 10 తెలుగు సాంగ్స్ ఇవే.
What's Your Reaction?






