Chhaava Movie Review Telugu - Powerful Action Emotional Drama
Chhaava Movie Review Telugu ప్రస్తుతం హిందీ సినిమా పరిశ్రమలో వస్తున్న పలు సినిమాలు ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా భారతీయ ప్రేక్షకులు హిస్టారికల్, మైథలాజికల్ కథనాలతో

ప్రస్తుతం హిందీ సినిమా పరిశ్రమలో వస్తున్న పలు సినిమాలు ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా భారతీయ ప్రేక్షకులు హిస్టారికల్, మైథలాజికల్ కథనాలతో ఆకట్టుకునే రీతిన సినిమాలు తీస్తే మంచి ఆదరణ అందిస్తారనేది తెలిసిందే. ఇక తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా యువ టాలెంటెడ్ నటుడు విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన హిస్టారికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఛావా.
ఈ మూవీ యొక్క టీజర్, ట్రైలర్, పోస్టర్స్ ఇటీవల రిలీజ్ అయి అందర్నీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఛత్రపతి శివాజీ తరువాత మరాఠా యోధుడిగా పేరుగాంచిన ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథగా ఛావా మూవీ రూపొందింది. దీనిని మ్యాడాక్ ఫిలిమ్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో నిర్మించింది. మరి ఈ మూవీ ఎలా ఉందనేది పూర్తి రివ్యూలో చూద్దాం.
సినిమా పేరు : ఛావా (Chhaava)
రేటింగ్ : 3.5 / 5
తారాగణం : విక్కీ కౌశల్, రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా, డయానా పేంటీ, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు
దర్శకుడు : లక్ష్మణ్ ఉటేకర్
నిర్మాత : దినేష్ విజన్
రిలీజ్ డేట్ : 14 ఫిబ్రవరి 2025
కథ :
వీర యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణాంతరం ఒక్కసారిగా మరాఠా సామ్రాజ్యం మొత్తం కూడా చీకట్లు అలుముకుంటాయి, దానితో ఇదే అదనుగా భావించి ఆ రాజ్యాన్ని తన కైవశం చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు. కాగా ఒక్కసారిగా అతడి చర్యలకు అడ్డుపడి పోరాడతాడు ఛత్రపతి శంభాజీ మహారాజ్.
తన యుద్ధ నైపుణ్యంతో మొఘల్ సైన్యాన్ని గట్టిగా ప్రతిఘటించడంతో స్వయంగా ఔరంగజేబు యుద్ధ బరిలోకి దిగుతాడు. కాగా ఆ సమయంలో కొందరు శంభాజీ అనునాయులే ఆయనకు వెన్నుపోటు పొడుస్తారు. మరి వారి బారి నుండి మరాఠా సామ్రాజ్యాన్ని చివరికి శంభాజీ మహారాజ్ దక్కించుకుంటారా, ఇంతకీ ఆ వెన్నుపోటుదారులు ఎవరు అనేది మొత్తం కూడా మనం సినిమాలో చూడాల్సిందే.
నటీనటుల పెర్ఫార్మన్స్ :
ముఖ్యంగా ఛావా మూవీలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్ అత్యద్భుత పెర్ఫార్మన్స్ కనబరిచారని చెప్పాలి. పలు కీలక యుద్ధ సన్నివేశాలతో పాటు పలు యాక్షన్, ఎమోషనల్ సీన్స్ లో ఆయన నటన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా శంభాజీ మజరాజ్ పాత్ర కోసం ఆయన పడ్డ కష్టం మొత్తం కూడా మనకు తెర మీద కనపడుతుంది.
ఇక ఆయన భార్యగా మహారాణి యేసుబాయ్ పాత్రలో రష్మిక మందన్న నటన కూడా ఎంతో అద్భుతం. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో రష్మిక పుష్ప 2 అనంతరం మరొక్కసారి ఆకట్టుకున్నారు. ఇక ఔరంగజేబు పాత్రలో కనిపించిన అక్షయ్ ఖన్నా కూడా చాలా చక్కగా పెర్ఫార్మ్ చేశారని చెప్పాలి. అలానే ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించినా అశుతోష్ రాణా, దివ్య దత్తా, డయానా పేంటీ వంటి వారు కూడా తమ తమ పాత్రల యొక్క పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
విశ్లేషణ :
ముఖ్యంగా ప్రధాన పాత్రధారుల యొక్క నటన అత్యద్భుతంగా ఉన్న ఛావా మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ మొత్తం పర్వాలేదనిపిస్తుంది అంతే. ఇక సెకండ్ హాఫ్ లో అయితే యుద్ధ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్ మరింతగా అలరిస్తాయి. అయితే వెన్నుపోటు, ద్రోహం వంటి అంశాలని మరింత బలమైన ఎమోషన్ తో తీసి ఉంటే బాగుండేదనిపిస్తుంది.
ఇక దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ అన్ని విభాగాల విషయంలో జాగ్రత్త పడ్డప్పటికీ స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం ఇంకాస్త శ్రద్ధ పెడితే బాగుండేది. అక్కడక్కడా కథనం కొంత నెమ్మదిస్తుంది. కథలో నిజానికి చాలా బలమైన పాత్రలు ఉన్నా, వాటిలో కొన్ని మాత్రమే సినిమాలో ప్రాధాన్యతనివ్వబడ్డాయి. ముఖ్యంగా ఔరంగజేబు పాత్రలో కనిపించిన అక్షయ ఖన్నా పాత్ర మరికొంత ఉంటే బాగుండేది. భారీ నిర్మాణ విలువలు, అక్కడక్కడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. మొత్తంగా అయితే మూవీ ఆకట్టుకుంటుంది.
ప్లస్ పాయింట్స్ :
విక్కీ కౌశల్ పెర్ఫార్మన్స్
ఫస్ట్ హాఫ్
యుద్ధ సన్నివేశాలు
చివరి అరగంట
మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడా నెమ్మదించడం
సెకండ్ హాఫ్ ప్రారంభ అరగంట
తీర్పు :
మొత్తంగా ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత గాథ ఆధారంగా రూపొందిన హిస్టారికల్ యాక్షన్ డ్రామా మూవీ ఛావా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందనే చెప్పాలి. సెకండ్ హాఫ్ లోని భారీ యాక్షన్ యుద్ధ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్, చివరి అరగంట వంటివి బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ మాత్రం పర్వాలేదనిపిస్తుంది. హీరో విక్కీ కౌశల్ సూపర్ యాక్టింగ్ మరొక ప్రధాన బలం. వీలైతే హిస్టారికల్ యాక్షన్ మూవీస్ ఇష్టపడేవారు ఈవారం తప్పకుండా ఛావా చూసి థియేటర్స్ లో ఆనందించండి.
What's Your Reaction?






