Prabhas’ Spirit Latest Update: Release Date, Cast & More
Get the latest update on Prabhas’ upcoming movie Spirit! Check out the release date, cast, director, and exclusive news about this highly anticipated film.

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం రెండు సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వాటిలో ఒకటి మారుతీ తీస్తున్న ది రాజా సాబ్. ఈ మూవీలో యువ అందాల కథానాయికలు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రద్దీ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
Prabhas’ Spirit Heroine Everything You Need to Know
ఈ మూవీ హర్రర్ కామెడీ యాక్షన్ మూవీగా తెరకెక్కుతుండగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఇందులో విలన్ గా కీలక పాత్ర చేస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఇటీవల ది రాజాసాబ్ నుండి రిలీజ్ అయిన ప్రభాస్ ఫస్ట్ గ్లింప్స్ టీజర్ తో పాటు మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.
అన్ని వర్గాల ఆడియన్సు తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ ని కూడా ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ని మరింతగా అలరించేలా ఈ మూవీ యొక్క కథ, కథనాలు దర్శకుడు మారుతీ అద్భుతంగా రాసుకున్నట్లు చెప్తోంది టీమ్. చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ఇక దీనితో పాటు ఇమాన్వి కథానాయికగా సీతారామం మూవీ దర్శకుడు హను రాఘవపూడితో ఒక మూవీ కూడా చేస్తున్నారు ప్రభాస్. ఈమూవీ రెండవ ప్రపంచయుద్ధ నేపథ్యంలో సాగె లవ్, యక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుండగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.
ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్ర చేస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ రెండు సినిమాల తరువాత మరొక నాలుగు సినిమాలు ప్రభాస్ లైనప్ లో ఉన్నాయి.
అవి ప్రశాంత్ వర్మ తీయనున్న భారీ మూవీ, ఆనిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తీయనున్న స్పిరిట్, ప్రశాంత నీల్ సలార్ 2, నాగ అశ్విన్ తెరకెక్కించనున్న కల్కి 2. కాగా ఈ క్రేజీ ప్రాజక్ట్స్ అన్నిటి పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ది రాజా సాబ్ తో పాటు హను రాఘవపూడి మూవీ చేస్తున్న ప్రభాస్, త్వరలో సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సెట్స్ లో జాయిన్ అవ్వనున్నారు.
ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం రానున్న మార్చి 30న ఉగాది సందర్భంగా ఈమూవీ యొక్క ప్రారంభోత్సవం ఉంటుందట. ప్రస్తుతం దానికి సంబంధించి పనులు కూడా ప్రారంభం అయ్యాయట. కాగా ఈ మూవీలో ప్రభాస్ ఒకజ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయనున్నారు. అయితే స్పిరిట్ కోసం ప్రభాస్ బల్క్ గా డేట్స్ ని అందించనున్నారట.
అంటే ఒకసారి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యాక మరొక సినిమా షూట్ ప్రారంభించరట ప్రభాస్. ఇప్పటికే స్పిరిట్ మూవీ యొక్క స్క్రిప్ట్ వర్క్ మొత్తం కూడా పూర్తి చేసిన సందీప్ రెడ్డి వంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా వేగంగా చేస్తున్నారట. అన్ని అనుకున్నట్లు జరిగితే ఉగాదికి ప్రారంభోత్సవం జరుపుకునే ఈ మూవీ ఈ ఏడాది చివర్లో పట్టాలెక్కి పక్కాగా 2027 ద్వితీయార్ధంలో ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
Spirit Movie Release Date & Latest News
భద్రకాళి పిక్చర్స్, టి సిరీస్ ఫిలిమ్స్ సంస్థలు స్పిరిట్ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత స్థాయిలో భారీ వ్యయంతో నిర్మించనున్నాయి. గతంలో రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి వంగ తీరిన ఆనిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద విజయం సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద మొత్తంగా రూ. 930 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుంది.
అయితే అక్కడక్కడా కొంత విమర్శలు ఎదురైనప్పటికీ ఆనిమల్ ఈ రేంజ్ సక్సెస్ సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. కాగా స్పిరిట్ మూవీకి సంబంధించి ఇప్పటికే యువ సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలెట్టేసారు. ఆనిమల్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ ఆకట్టుకోగా అంతకుమించి మరింత అద్భుతంగా ఉండేలా దర్శకుడు సందీప్ పూర్తి కేర్ తీసుకుంటున్నారట.
ఇక ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని లేటెస్ట్ బాలీవుడ్ వర్గాల బజ్. ఇటీవల కొన్నాళ్లుగా ఈ మూవీ యొక్క హీరోయిన్ గా ఆల్మోస్ట్ రష్మిక ఫిక్స్ అని వార్తలు, కథనాలు ప్రచారం అవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి స్పిరిట్ మూవీ టీమ్ నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రావాల్సి ఉంది. కాగా ఇండియా వైడ్ ఎంతో భారీ క్రేజ్ కల్గిన పాన్ ఇండియన్ మూవీస్ లో ఒకటైన స్పిరిట్ మూవీ తెరకెక్కిన అనంతరం ఎంత మేర బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మ్రోగిస్తుందో తెలియాలి అంటే మరొక ఏడాదిన్నర ఆగాల్సిందే.
What's Your Reaction?






