Salaar Part 1 Ceasefire Meaning in Telugu Explained

What does Ceasefire meaning in Salaar Part 1? Here's the Telugu meaning and its connection to the storyline.

Salaar Part 1 Ceasefire Meaning in Telugu Explained

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా ఇటీవల కెజిఎఫ్ (KGF) సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కించిన భారీ ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ ఇండియన్ మాస్ యాక్షన్ మూవీ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ (Salaar Part 1 Ceasefire). ఈ మూవీలో అందాల నటి శృతి హాసన్ (Shrutii Haasan) హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో పృథ్వీరాజ్ సుకుమారన్, ఝాన్సీ, శ్రియ రెడ్డి, బ్రహ్మాజీ, బాబీ సింహా, జగపతి బాబు తదితరులు నటించారు. 

ఈ మూవీని ఎంతో భారీ వ్యయంతో హోంబలే ఫిలిమ్స్ (Hombale Films) వారు నిర్మించగా రవి బస్రూర్ సంగీతాన్ని అలానే భువన గౌడ ఫోటోగ్రఫిని అందించారు. ఇందులో దేవా పాత్రలో ప్రభాస్ పవర్ఫుల్ యాక్టింగ్ తో పాటు భారీ మాస్ యాక్షన్ సీన్స్, ఎలివేషన్ సన్నివేశాలు అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. 

సలార్ టైటిల్‌లో 'Ceasefire' అర్థం ఏమిటి?

ముఖ్యంగా ప్రశాంత్ నీల్ టేకింగ్ తో పాటు గ్రాండియర్ విజువల్స్, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి కూడా ఎంతో అలరించాయి. హీరోయిన్ గా శృతి హాసన్ పెర్ఫార్మన్స్ కి కూడా మంచి పేరు లభించింది. కీలకమైన పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) తో పాటు జగపతి బాబు కూడా అదరగొట్టారు. 

మొత్తంగా మొదటి నుండి అందరిలో ఎన్నో భారీ అంచనాలు ఏర్పరిచిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ మూవీ ఓవరాల్ గా క్లోజింగ్ లో రూ. 700 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ (Boxoffice Collection) ని ప్రపంచవ్యాప్తంగా సొంతం చేసుకుంది. తనకు ప్రాణప్రదమైన స్నేహితుడు వరదరాజ మన్నార్ కోసం దేవా ఏవిధంగా అండగా నిలిచాడు, అనంతరం కొన్ని పరిణామాల రీత్యా వారిద్దరి మధ్య వైరం ఎందుకు వచ్చింది అనేటువంటి కథాంశంతో ఈ మూవీ రూపొందింది. 

టైటిల్‌కు కథతో ఉన్న అనుబంధం

ఇక మూవీ యొక్క ఉపశీర్షిక అయిన సీజ్ ఫైర్ (Ceasefire) అంటే, ఫైరింగ్ ని ఇరు వర్గాలు కూడా ఆపేయడం అని అర్ధం. సినిమాలోని ప్రీ క్లైమాక్స్ సీన్స్ లో సీజ్ ఫైర్ అంశం తెరపైకి వస్తుంది, పరిస్థితుల రీత్యా అందరూ ఫైరింగ్ చేయకూడదు, ఇతర వర్గాల వారికి ఏమాత్రం నష్టం కలిగించడం, దాడి చేయడం వంటివి చేయకూడదనే నియమాన్ని పెడతాడు రాజమన్నార్. 

అయితే దాని అనంతరం వరద దాని రద్దుకు ఓటేస్తాడు. మొదటి నుండి స్నేహితుడంటే ప్రాణప్రదంగా నిలిచే వరద ఒక్కసారిగా ఎందుకు మారిపోతాడు, దానికి గల కారణాలు ఏంటి, అసలు దేవా గతం ఏంటనేది మొత్తం కూడా రానున్న సలార్ పార్ట్ 2 సౌర్యాంగ పర్వం (Salaar Part 2 Shouryanga Parvam) మూవీలో చూడాల్సిందే. మరోవైపు సలార్ మూవీ టీమ్ పార్ట్ 2 కి సంబందించి కొంతమేర ఫస్ట్ పార్ట్ టైం లోనే షూట్ చేసారు.

సినిమాలో యుద్ధ విరామం యొక్క ప్రాముఖ్యత  

అయితే మిగతా పూర్తి సినిమాని పట్టాలెక్కించడానికి మరొక ఏడాదికి పైగా టైం పట్టేలా కనపడుతోంది. ప్రస్తుతం ప్రభాస్ ది రాజా సాబ్ (The Rajasaab), హను రాఘవపూడి మూవీ, స్పిరిట్ (Spirit) మూవీ, ఇలా ఈ మూడింటితో బిజీగా ఉన్నారు. అలానే ప్రశాంత్ నీల్ కూడా ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NT Ramarao Jr) తో ఒక భారీ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ మూవీ తీస్తున్నారు. 

కాగా అటు ప్రభాస్, ఇటు ప్రశాంత్ నీల్ ఇద్దరి యొక్క ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తి అయి పక్కాగా సలార్ 2 మరి ఎప్పుడు మొదలవుతుందో తెలియాలి అంటే మరొక ఏడాదికి పైగా వెయిట్ చేయక తప్పదు. కాగా సలార్ 2 వీలైనంత త్వరలోనే పట్టాలెక్కి, ఆపై రిలీజ్ అనంతరం పార్ట్ 1 ని మించేలా విజయం సొంతం చేసుకోవాలని మా తెలుగు మూవీ మీడియా డాట్ కామ్ టీమ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.    

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow