Pawan Kalyan's OG: Anticipated Release Date and Latest Updates

Pawan Kalyan's upcoming film OG. While an official release date is yet to be confirmed, get the latest news and developments here.

Pawan Kalyan's OG: Anticipated Release Date and Latest Updates

టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా తాజాగా మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. అందులో తాజాగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ తెరకెక్కిస్తున్న హరి హర వీర మల్లు (Hari Hara Veera Mallu) కి సంబంధించి తన పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేసారు. 

ఈ మూవీ లో నిధి ఆగ్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్ గా నటిస్తుండగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం గ్రాండ్ గా భారీ స్థాయిలో పాన్ ఇండియన్ లెవెల్లో నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన రెండు సొంగ్స్ తో పాటు మూడు గ్లింప్స్ టీజర్లు అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈమూవీ జూన్ మధ్యలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. 

పవన్ కళ్యాణ్ 'OG' విడుదల తేదీ

త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ గురించిన అఫీషియల్ అప్ డేట్ రానుంది. అయితే దీనితో పాటు సుజీత్ తో ఓజి (OG) (They Call Him OG) మూవీతో పాటు హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) మూవీస్ చేస్తున్నారు. కాగా ఈ మూడు సినిమాల పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. 

అయితే హరి హర వీర మల్లు అనంతరం ఓజి మూవీ కూడా ఆల్మోస్ట్ 80 శాతం పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య గ్రాండ్ గా పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తుండగా రాక్ స్టార్ ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. 

యంగ్ టాలెంటెడ్ బ్యూటీ ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్ గా కనిపించనుండగా శ్రియ రెడ్డి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్ ఇతర ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

OG సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్స్

తనకు ఎంతో ఇష్టమైన పవర్ స్టార్ తో చేస్తున్న మూవీ కావడంతో దర్శకుడు సుజీత్ ఓజి మూవీ యొక్క కథ, కథనాలు అద్భుతంగా రాసుకుని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఓజి మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై అమాంతంగా అంచనాలు పెంచేసాయి. 

ఈ మూవీలో ఓజాస్ గంభీర అనే మాస్ గ్యాంగ్ స్టర్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. దాదాపుగా రూ. 250 కోట్లకు పైగా భారీ వ్యయంతో ఎంతో ప్రతిష్టత్మకంగా హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందుతున్న ఓజి మూవీ ఇప్పటికే పలుమార్లు రిలీజ్ వాయిదా పడింది. 

ఓవైపు తన జనసేన పార్టీ (Janasena Party) తరపున ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పిఠాపురం నియోజకవర్గ ఎమ్యెల్యేగా అలానే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా రాజకీయాల పరంగా బిజీ బిజీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక అతి త్వరలో ఓజి మూవీతో పాటు హరీష్ తీస్తున్న ఉస్తాద్ భగత్ సినిమాలకి సంబంధించి తన పార్ట్ బ్యాలెన్స్ షూటింగ్ ని పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు పవన్ కళ్యాణ్. 

OG సినిమా కథ మరియు నటీనటులు

కాగా మొత్తం ఈ మూడు సినిమాల్లో పవన్ ఫ్యాన్స్ అయితే ఓజి మూవీ పై ఎంతో అంచనాలు ఏర్పరుచుకున్నారు. సుజీత్ తప్పకుండా తమ అభిమాన పవర్ స్టార్ ని అద్భుతంగా చూపిస్తారని నమ్మకాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. కాగా లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఓజి మూవీ ఈ ఏడాది అక్టోబర్ లో ఆడియన్స్ ముందుకి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. త్వరలో ఓజి టీమ్ నుండి దీని పై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు చెప్తున్నారు.

అన్ని అనుకున్నట్లు జరిగితే తప్పకుండా ఈ ఏడాది పవన్ నుండి రెండు సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. త్వరలో ఓజి మూవీ నుండి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం అని, ఆ సాంగ్ ని తమిళ స్టార్ హీరో శింబు అద్భుతంగా పడ్డారని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇటీవల ఒక కార్యక్రమంలో భాగంగా చెప్పారు. 

అలానే ఓజి మూవీ స్టోరీ అదిరిపోతుందని, ముఖ్యంగా సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకునేలా టీమ్ మొత్తం ఎంతో శ్రమిస్తున్నట్లు తెలిపారు థమన్. మరి అందరిలో ఈ స్థాయి అంచనాలు ఏర్పరిచిన ఓజి మావోయి రిలీజ్ అనంతరం ఎంతమేర విజయం అందుకుంటుందో చూద్దాం. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ తెలుగు మూవీ న్యూస్ అండ్ అప్ డేట్స్ కోసం తరచు మా Telugu Movie Media వెబ్ సైట్ చూస్తూ ఫాలో చేస్తూ ఉండండి    

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow