HIT 3 Teaser: Nani’s Power-Packed Look & Release Date Revealed

HIT 3 Teaser: Nani as Arjun Sarkaar stuns in an intense avatar! Watch the power-packed teaser & know the release date here

HIT 3 Teaser: Nani’s Power-Packed Look & Release Date Revealed

నాచురల్ స్టార్ నాని హీరోగా కెజిఎఫ్ సినిమాల హీరోయిన్ శ్రీనిధి శెట్టి కథానాయికగా యువ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ హిట్ 3. ఇటీవల హిట్ సిరీస్ నుండి వచ్చిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యాయి. కాగా హిట్ 1 మూవీలో యువ నటుడు విశ్వక్ సేన్ హీరోగా నటించగా హిట్ 2 లో మరొక యువ నటుడు అడివి శేష్ హీరోగా నటించారు. 

HIT 3 Teaser: Nani’s Intense Avatar & Major Highlights

ఇక ఈ రెండు సినిమాల అనంతరం తాజాగా నాని హీరోలాగా రూపొందుతోన్న హిట్ 3 పై అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని యూనానిమస్ ప్రొడక్షన్స్ సంస్థ తో కలిసి హీరో నాని స్వయంగా తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. 

యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్స్ అందరినీ ఆకట్టుకోగా నిన్న నాని బర్త్ డే సందర్భంగా టీజర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ఇక ఈ మూవీ టీజర్ అందరినీ ఆకట్టుకంటూ ప్రస్తుతం యూట్యూబ్ లో దూసుకెళుతోంది. అలానే ఈ మూవీ టీజర్ గడచిన 24 గంటల్లో 17 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని నాని కెరీర్ లో రికార్డు సొంతం చేసుకుంది. 

టైర్ 1 హీరోస్ మినహాయిస్తే ఈ టీజర్ యొక్క రెస్పాన్స్ టాప్ రికార్డు అని అంటున్నాయి సినీ వర్గాలు. ఇక టీజర్ గురించి మాట్లాడుకుంటే, నాని ఈ మూవీలో పోషిస్తున్న అర్జున్ సర్కార్ పాత్రని సూపర్ గా చూపించారు. టీజర్ లో మోస్ట్ వయొలెంట్ పోలీస్ అధికారిగా నాని కనిపించారు. 

HIT 3 Teaser Breakdown: Key Scenes & Action Sequences

టీజర్ ని బట్టి చూస్తే రెండు పార్టులతో పోలిస్తే ఈ పార్ట్ 3 లో మరింతగా థ్రిల్లింగ్ అమాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలానే టీజర్ లో విజువల్స్ తో పాటు యాక్షన్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, డైలాగ్స్ అన్ని కూడా అదిరిపోయాయి. మే 1 న ఈ మూవీ గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. 

ఇప్పటికే మూవీ కి సంబంధించి చాలావరకు షూటింగ్ అయితే పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇటీవల వివేక్ ఆత్రేయ తీసిన సరిపోదా శనివారం మూవీతో మంచి విజయం అందుకున్న నాని, తాజాగా రూపొందుతోన్న హిట్ 3 తో మరొక విజయం తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అని అంటున్నాయి మూవీ వర్గాలు. 

HIT 3 Release Date & Plot Expectations

అర్జున్ సర్కార్ పాత్ర కోసం నటుడిగా నాని ఎంతో కష్టపడుతున్నారని, అలానే ఆయన కెరీర్ మొత్తంలో ఈ పాత్ర తప్పకుండా మరింత మంచి పేరు తీసుకువస్తుందని చెప్తున్నారు. త్వరలో హిట్ 3 నుండి ఫస్ట్ సాంగ్ ని కూడా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉందట మూవీ టీమ్. కాగా తమ అభిమాన హీరో టీజర్ అందరినీ ఆకట్టుకుని యూట్యూబ్ లో బాగా రెస్పాన్స్ అందుకుంటూ ఉండడంతో అన్ని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ఇంకా ఈ మూవీలో సూర్య శ్రీనివాస్. ఆదిల్ పాల, రావు రమేష్, వైవా హర్ష, బ్రహ్మజ్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు చేస్తున్నారు. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ మూవీలో విశ్వక్, అడివి శేష్ ఇద్దరూ కూడా కొన్ని క్షణాల పాటు కీలక పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది. సను జాన్ వర్గేసే ఫోటోగ్రఫి అందిస్తున్న హిట్ 3 మూవీ రిలీజ్ అనంతరం ఎంత మేర ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరొక రెండు నెలల వరకు ఆగాల్సిందే. 

HIT 3 vs Previous HIT Movies: What’s New in the Franchise?

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow