Anaganaga Movie Review: Sumanth Shines on ETV Win

Anaganaga movie starring Sumanth now streaming on ETV Win. Read the full review, performance highlights, and audience response on Telugu Movie Media.

Anaganaga Movie Review: Sumanth Shines on ETV Win

అనగనగా (Anaganaga) రివ్యూ : హృద్యమైన దృశ్య కావ్యం 

సినిమా పేరు : అనగనగా 

తెలుగు మూవీ మీడియా. కామ్ రేటింగ్ : 4. 5 / 5

నటీనటులు : సుమంత్, కాజల్ చౌదరి, శ్రీనివాస్ అవసరాల, మాస్టర్ విహార్ష్, అను హాసన్, రాకేష్ రాచకొండ, కౌముది నేమని, బివిఎస్ రవి 
తదితరులు 

దర్శకత్వం : సన్నీ సంజయ్

నిర్మాతలు : రాకేష్ రెడ్డి గాదం, రుద్ర మాదిరెడ్డి 

సంగీతం : చందు రవి 

ఫోటోగ్రఫి : పవన్ పప్పుల 

ETV Win లో విడుదలైన 'అనగనగా' మూవీ రివ్యూ

సుమంత్ హీరోగా యువ నటి కాజల్ చౌదరి హీరోయిన్ గా తాజాగా తెరకెక్కిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా మూవీ అనగనగా. ఈ మూవీ యొక్క టీజర్, ట్రైలర్ అందరిలో మంచి ఇంట్రెస్ట్ ని ఏర్పరిచాయి. కొంత గ్యాప్ అనంతరం సుమంత్ చేసిన మూవీ ఇది. అయితే దీనిని ప్రముఖ తెలుగు మాధ్యమం ఈటివి విన్ (ETV WIN) లో నిన్నటి నుండి డిజిటల్ గా ఆడియన్స్ కి అందుబాటులోకి తీసుకువచ్చారు. మరి అనగనగా మూవీ ఎలా ఉందనేది ఇప్పుడు పూర్తి రివ్యూ లో చూద్దాం. 

కథ :

ఒక ప్రముఖ స్కూల్ లో టీచర్ గా వ్యాస్ (Sumanth) పనిచేస్తుండగా అతడి భార్య భాగీ (Kajal Chaudhary) కూడా అదే స్కూల్ లో ప్రినిసిపాల్ గా పనిచేస్తూ ఉంటుంది. అయితే ఆ స్కూల్ లో విద్యార్ధులకి అంతా ఇంగ్లీష్ మీడియంలో చెప్తుండడం వ్యాస్ కి ఏమాత్రం నచ్చదు. 

అలా కాకుండా ఒక కాన్సెప్ట్ ప్రకారం ప్రతి విద్యార్థికి అర్ధం అయ్యే రీతిలో కథ మాదిరిగా వివరంగా చెప్పాలని ప్రయత్నిస్తాడు. ఇక వారి కుమారుడు రామ్ (Master Viharsh) కూడా అదే స్కూల్ లో చదువుతుంటారు. అయితే ఆ ఏడాది జరిగే ఫైనల్ ఎగ్జామ్స్ లో మరికొందరు విద్యార్థులతో పాటు రామ్ కూడా ఫెయిల్ అవుతాడు. 

దానితో వ్యాస్ అనుసరించే విధానాలు, పాఠాలు చెప్పే పద్ధతులు సరిగ్గా లేకపోవడం కారణం అని భావించి అతడిని ఉద్యోగం నుండి తీసేయాలని భావిస్తుంది స్కూల్ యాజమాన్యం. అనంతరం ఏమి జరిగింది, వ్యాస్ ని తీసేసారా, ఆపై వ్యాస్ ఎలా ముందుకు సాగాడు, అతడు కోరుకున్న కథా కాన్సెప్ట్ బోధనా శైలి, ,మొత్తంగా కథ ఎటు సాగుతుందనేది మొత్తం కూడా సినిమాలో చూడాల్సిందే. 

ప్లస్ పాయింట్స్ :

ముఖ్యంగా ఈ మూవీలో చెప్పుకోవాల్సింది వ్యాస్ పాత్రలో తన సహజ నటనతో ఆ పాత్రకి జీవం పోసిన హీరో సుమంత్ గురించి. వాస్తవానికి ఆ పాత్రలో ఎంతో బలమైన ఎమోషన్స్, హృద్యమైన సన్నివేశాల్లో సుమంత్ జీవించేసారు. ఆద్యంతం ఆ పాత్ర చూస్తున్నంతసేపు మనం కూడా ఆయనతో కలిసి నడుస్తున్నట్లు అనిపిస్తుంది. 

ఇక కాజల్ చౌదరి కూడా తన పాత్ర యొక్క పరిధి మేరకు బాగా ఆకట్టుకున్నారు. కీలక పాత్రలు చేసిన అవసరాల శ్రీనివాస్, మాస్టర్ విహార్ష్, రాకేష్ రాచకొండ, అను హాసన్ వంటి వారి పాత్రలు కూడా ఎంతో ఆకట్టుకుంటాయి. ప్రతి ఒక్క పాత్ర మన మదిని తాకుతుంది, కదిలిస్తుంది. ఆ విధంగా ఉన్నవి కొద్ది కీలక పాత్రలైనా ప్రతి ఒక్కరికీ మంచి ప్రాధాన్యం అందించారు. 

ఇక ముఖ్యంగా దర్శకుడు సన్నీ సంజయ్ గురించి చెప్పుకోవాలి. నేటి కాలంలో విద్యార్థులని బట్టి రీతిన పాఠ్యాంశాలు నేర్పించి వారిలో వాస్తవికత, తెలివిని పెంపొందించే విధానాలకు చాలావరకు తిలోదకాలిస్తున్నాయి పలు పెద్ద విద్యాసంస్థలు. అయితే ఆ విధమా కాకుంగా ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ ప్రకారం కథ రీతిన ప్రతి ఒక్క విద్యార్థికి అర్ధం అయ్యేలా చెప్పాలనే ఉద్దేశ్యంతో వ్యాస్ అనే టీచర్ అనుసరించే విధానాన్ని మన కళ్ళకు కట్టినట్లు, మనసుని తాకేటట్లు ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు దర్శకుడు సన్నీ సంజయ్. 

అలానే తండ్రి కొడుకు, భార్య భర్తల మధ్యన ఎమోషనల్ సీన్స్ ఎంతో బాగా కుదిరాయి, మనం సినిమా ప్రారంభ సన్నివేశం నుండి ముగింపు వరకు ఎక్కడా కూడా కథ ప్రక్క దారి పట్టినట్లు ఉండదు సరికదా, వారి కుటుంబంతో మనం కూడా ప్రయాణం చేస్తున్నట్లు అనిపిస్తుంది. అంతలా కథ, కథనాలను అత్యద్భుత రీతిన రక్తి కట్టించారు.

సుమంత్ నటనపై ప్రేక్షకుల నుండి విశేష స్పందన
 

మైనస్ పాయింట్స్ : 

వాస్తవానికి విద్యావ్యవస్థ లో లోపాలని గురించిన ఇటువంటి అంశాలతో కూడిన కథలు గతంలోనే వచ్చాయి. అక్కడక్కడా కథనం కొద్దిగా నెమ్మదించడంతో పాటు కథ యొక్క కేంద్ర బిందువుకు సినిమా చేరుకోవడానికి కొంత సమయం అయితే పడుతుంది. ఓవరాల్ గా ఇంతకు మించి ఇటువంటి హృద్యమైన ఎమోషనల్ స్టోరీస్ లో మైనస్ గా చెప్పుకోవడానికి ఏమి ఉండవు, ఈ సినిమాలో అయితే అసలు లేనే లేవు కూడా. 

సాంకేతిక వర్గం :

ముఖ్యంగా ఈ సినిమాకి దర్శకత్వం వహించిన దర్శకుడు సన్నీ సంజయ్ తో పాటు చెప్పుకోవాల్సింది గ్రాండ్ గా ఉన్న నిర్మాణ విలువలు, సంగీత దర్శకుడు చందు రవి, ఫోటోగ్రాఫర్ పవన్ గురించి. పూర్తి కథ మొత్తం కూడా ఆకట్టుకునే విజువల్స్ తో సాగడంతో పాటు పలు సీన్స్ ఎంతో చక్కగా చిత్రీకరించారు ఫోటోగ్రాఫర్. 

అలానే సినిమాలోని విజయ్ ఏసుదాస్ పాడిన చూడు చూడు సాంగ్ ఎంతో మెలోడియస్ గా కథనానికి సందర్భానికి తగ్గట్లుగా అద్భుతమైన మ్యూజిక్, లిరిక్స్ తో అదిరిపోతుంది. అలానే పలు ఎమోషనల్ సీన్స్ లో పవన్ చందు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చక్కగా ఉంది. చాలావరకు కథని అందరికీ అర్ధమయ్యే రీతిన, అలానే ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే రీతిన తెరకెక్కించిన దర్శకుడు సన్నీ నిజంగా విజేత. 

కథ, దర్శకత్వం, మరియు సాంకేతిక అంశాలపై సమీక్ష

తీర్పు :

మొత్తంగా మంచి అంచనాలతో ప్రముఖ ఓటిటి మాధ్యమం ఈటివి విన్ లో డైరెక్ట్ గా రిలీజ్ అయిన అనగనగా మూవీ ఎంతో అద్భుతం అని చెప్పాలి. వ్యాస్ అనే టీచర్ పాత్రలో సుమంత్ సహజ నటన, ఆయన విదార్థులకి అవసరమైన సులువైన బోధన కోసం ఎంచుకున్న కాన్సెప్ట్ ఎంత బాగుందో, దానిని స్క్రీన్ పై ప్రతి ఆడియన్ మదిని తాకేలా దర్శకుడు సన్నీ సంజయ్ కూడా చిత్రీకరించారు. 

బలమైన కథ, కథనాలు, హృద్యమైన ఎమోషన్స్ తో రూపొందిన ఈ మూవీ తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి, వీలైతే మరింతమందికి చెప్పి చూడమనండి. మలయాళ చిత్రసీమకు ధీటుగా తెలుగులో కూడా ఇంతటి అద్భుతమైన బలమైన హృద్యమైన ఖాతాలున్న సినిమాలని మనం అందరం తప్పకుండా ఆదరించాలి. 

ఇటువంటి లేటెస్ట్ మూవీస్ యొక్క రివ్యూస్, లేటెస్ట్ తెలుగు మూవీ అప్ డేట్స్, తెలుగు మూవీ న్యూస్ కోసం ఎప్పటికప్పుడు మా Telugu Movie Media సైట్ ని చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow