Big Rumor About Allu Arjun's New Movie Shocks Fans!
A massive rumor about Allu Arjun's upcoming movie is spreading fast. Is it true? Get the latest updates here!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత ఏడాది సుకుమార్ తీసిన పుష్ప 2 ది రూల్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి అతి పెద్ద ఇండియన్ ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఆ మూవీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 1850 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుని హీరోగా అల్లు అర్జున్ రేంజ్ తో పాటు మార్కెట్ వేల్యూ ని కూడా అమాంతంగా పెంచేసింది.
Big Rumor About Allu Arjun's New Movie!
ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా మైత్రి మూవీ మేకర్స్ వారు ఈమూవీని ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. ఇక దీని అనంతరం కొంత గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్, త్వరలో గీతా ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంస్థలు గ్రాండ్ గా నిర్మించనున్న త్రివిక్రమ్ తీయనున్న మూవీలో నటిస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి.
అలానే ఆ మూవీ యొక్క అనౌన్స్ మెంట్ కూడా గత ఏడాది వచ్చింది. అయితే విషయం ఏమిటంటే, త్రివిక్రమ్ తీయనున్న మూవీ భారీ స్థాయిలో మైథలాజికల్ జానర్ లో రూపొందనుందని, దానికి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో పాటు స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారని సమాచారం.
Shocking Buzz in the Film Industry!
కాగా వాటికి చాలానే సమయం పడుతుందని, అయితే ఈలోపు జవాన్ దర్శకుడు అట్లీతో తన నెక్స్ట్ మూవీ చేసేందుకు అల్లు అర్జున్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అట్లీ మూవీ ప్రారంభించిన అనంతరం షూటింగ్ కొనసాగుతున్న సమయంలోనే మన సినిమా కూడా ప్రారంభిద్దాం అని త్రివిక్రమ్ కి అల్లు అర్జున్ మాట ఇచ్చారట.
కొద్దిరోజుల క్రితం పలుమార్లు అల్లు అర్జున్ ని ప్రత్యేకంగా కలిసిన దర్శకుడు అట్లీ ఆయనకు ఒక అద్భుతమైన యాక్షన్ కథని వినిపించారట. వాస్తవానికి జవాన్ అనంతరం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో అట్లీ ఒక భారీ మూవీ చేయనున్నారు అంటూ ఇటీవల పలు కథనాలు ప్రచారం అయ్యాయి.
అయితే ఏమైందో తెలియదుగాని సడన్ గా అల్లు అర్జున్ తో ఆయన జతకట్టేందుకు సిద్ధమయ్యారు. ఐతే అసలు వచ్చిన సమస్య ఏమిటంటే, ఈ మూవీ యొక్క బడ్జెట్, రెమ్యునరేషన్స్ విషయమై ప్రస్తుతం ప్రముఖ కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారితో చర్చలు జరుగుతున్నాయట.
Is This News Real or Just Hype?
ఇక ఈ మూవీ కోసం దర్శకుడు అట్లీ భారీగానే రెమ్యునరేషన్ అడుగుతున్నారని, మరోవైపు హీరోగా అల్లు అర్జున్ రేంజ్ కూడా పెరగడంతో ఆయన రెమ్యునరేష్ కూడా కలగలుపుకుని ఏ మూవీకి చాలానే బడ్జెట్ అవుతుందని టాక్. ఒకవేళ ఈ మూవీ లాక్ అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రూ. 800 కోట్లకు పైగా జరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.
ప్రస్తుతం అటు నిర్మాత, ఐదు దర్శకుడు అండ్ టీమ్ మధ్య చర్చలు జరుగుతున్నాయని, త్వరలో ఈ భారీ క్రేజీ కాంబినేషన్ మూవీకి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడవుతాయని అంటున్నాయి సినీ వర్గాలు.
Allu Arjun Fans Eagerly Waiting for Confirmation!
ఇక దీనిపై అనంతరం అటు త్రివిక్రమ్ సినిమాతో పాటు బోయపాటి శ్రీనుతో ఒక సినిమా, ఆనిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో కూడా సినిమాలు చేయనున్నారు అల్లు అర్జున్. వీటి అనంతరం సుకుమార్ తో పుష్ప 3 కూడా ఆయన కెరీర్ లైనప్ లో ఉంది. మరి వీటిలో పక్కాగా ఏఏ సినిమాలు ఎప్పుడు మొదలవుతాయి తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగవలసిందే.
What's Your Reaction?






