Shraddha Kapoor Fans Angry on Bollywood Producer
Shraddha Kapoor fans express anger at a Bollywood producer over shocking comments and casting issues. Here’s what really happened.

బాలీవుడ్ సినిమా పరిశ్రమలోని టాప్ స్టార్ హీరోయిన్స్ లో శ్రద్ధ కపూర్ కూడా ఒకరు. తన తండ్రి శక్తి కపూర్ ఆశీర్వాదంతో హిందీ చిత్ర సీమకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఒక్కో సినిమాతో నటిగా తన ఆకట్టుకునే అందం, అభినయంతో ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని అలరిస్తూ ప్రస్తుతం వరుసగా అవకాశాలతో కొనసాగుతున్నారు.
తొలిసారిగా హిందీ చిత్రసీమకు ఆమె 2010 లో తెరకెక్కిన తీన్ పట్టి మూవీ ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో మూవీ మంచి విజయం అందుకుని హీరోయిన్ గా తొలి చిత్రంతోనే శ్రద్ధ కు బాగా పేరు తీసుకువచ్చింది. అనంతరం సిద్దార్థ రాయ్ కపూర్ హీరోగా తెరకెక్కిన లవ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ ఆషికి 2 మూవీ అతి పెద్ద విజయం ఆమె కెరీర్ ని ఒక్కసారిగా పెద్ద మలుపు తిప్పింది. ఇక అక్కడి నుండి ఆమెకు హిందీలో అవకాశాలు క్యూ కట్టాయి.
Shraddha Kapoor Fans Furious Over Producer's Comments
ఆ తరువాత బాఘీ, ఏక్ విలన్, ఓకే జాను, స్త్రీ, స్త్రీ 2 సహా మరికొన్ని సినిమాల్లో నటించి మంచి విజయాలు సొంతం చేసుకున్నారు. ఆపైన ప్రభాస్ హీరోగా సుజీత్ తీసిన పాన్ ఇండియన్ మూవీ సాహో తో తెలుగు తో పాటు పలు ఇతర సౌత్ ఇండియన్ భాషల ఆడియన్స్ కి కూడా శ్రద్ధ చేరువయ్యారు. ఇటీవల అమర్ కౌశిక్ తీసిన స్త్రీ 2 మూవీ అతి పెద్ద విజయం ఆమెకు నటిగా విపరీతమైన క్రేజ్ ని భారీ మార్కెట్ ని తీసుకువచ్చింది.
అయితే ఈ సినిమా తెరకెక్కించాలని తాము భావించిన సమయంలో నిర్మాత దినేష్ విజన్ చెప్పిన ఒక విషయం ద్వారా ఇందులో హీరోయిన్ గా శ్రద్ధ ని ఎంపిక చేసాం అని తాజాగా దర్శకుడు ఆమె స్పందించారు. అటువంటి హర్రర్ కామెడీ మూవీలో శ్రద్ధ కపూర్ అయితే బాగుంటుందని తనకు దినేష్ చెప్పారని ఆయన అన్నారు.
What Triggered the Backlash?
ఆ క్రెడిట్ మొత్తం కూడా దినేష్ కె చెందుతుందని, అసలు ఆమెను ఎందుకు ఎంపిక చేసాము అనే కారణాన్ని కూడా అమర్ బయటపెట్టారు. ఒకానొక సందర్భంలో హీరోయిన్ శ్రద్ధ కపూర్ తో కలిసి దినేష్ విజన్ ఒక ఫ్లైట్ లో ప్రయాణించారని, ఆ సందర్భంలో ఆమెతో పలు సంగతులు మాట్లాడిన దినేష్, ఆమె నవ్వు అచ్చం దెయ్యం మాదిరిగా ఉండడంతో తమ స్త్రీ 2 మూవీకి ఆమెనే కరెక్ట్ అని భావించారట.
Social Media Reactions from Shraddha Fans
శ్రద్ధ అయితేనే ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయగలదని దినేష్ అప్పుడే భావించి వెంటనే తనకు విషయం చెప్పారని అన్నారు అమర్ కౌశిక్. అయితే తమ అభిమాన కథానాయిక పట్ల నిర్మాత దినేష్ విజన్ ఆ విధంగా వ్యాఖ్యానించడం సరికాదని, స్త్రీ 2 మూవీ భారీ విజయంతో వందల కోట్లని ఆర్జించి హీరోయిన్ పై ఈ విధంగా ఎలా మాట్లాడతారని పలువురు శ్రద్ధ కపూర్ ఫ్యాన్స్ నెట్టింట మండిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు బాలీవుడ్ మీడియాలో కూడా ఈ న్యూస్ పై పలు కథనాలు వస్తున్నాయి. మరి ఈ వ్యాఖ్యల పై హీరోయిన్ శ్రద్ధ కపూర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
What's Your Reaction?






