Tollywood Top 10 Movies Collections (2013–2020)

Explore the top 10 highest-grossing Tollywood movies from 2013 to 2020. Find out which Telugu films ruled the box office with massive collections

Tollywood Top 10 Movies Collections (2013–2020)

తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటివరకు వచ్చిన అనేక సినిమాలలో కొన్ని సినిమాలు మంచి విజయాలు సొంతం చేసుకోగా అందులో మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. అయితే ఇంకొన్ని మాత్రం సంచలన విజయాలు సొంతం చేసుకుని తెలుగు సినిమా ఖ్యాతిని మరింతగా పెంచడంతో పాటు సరికొత్త రికార్డ్స్ ని సృష్టించడం జరిగింది. అయితే వాటిలో చాలా సినిమాలు భారీ కలెక్షన్స్ కూడా అందుకోవడం జరిగింది. ఇక ఇటీవల కొన్నేళ్లలో విడుదలైన సినిమాల్లో ఏఏ సినిమాలు భారీ రేంజ్ కలెక్షన్ అందుకుని టాప్ స్థానంలో నిలిచాయి అనేది ఇప్పుడు చూద్దాం. 


1.  బాహుబలి - 2 : (Baahubali 2: The Conclusion)

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్సకత్వంలో ఆర్కా మీడియా బ్యానర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా రూపొందిన బాహుబలి 2 మూవీ, అతకముందు సంచలన విజయం సొంత చేసుకున్న బాహుబలి సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. ప్రభాస్ ఈ సినిమాలో అమరేంద్ర బాహుబలిగా, అలానే మహేంద్ర బాహుబలి గా నటించిన విషయం తెలిసిందే. అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా, సుబ్బరాజు, సత్యరాజ్ తదితరులు ఇతరపాత్ర లు చేసిన ఈ సినిమాలో అత్యద్భుత గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, సాంగ్స్, భారీ యాక్షన్ సీన్స్, నటీనటుల అత్యద్భుత నటన వెరసి బాహుబలి 2 మూవీ ని భారతీయ సినిమా చరిత్రలో అతి పెద్ద విజయాన్ని అందుకునేలా చేసాయి. ఇక ఈ సినిమా రిలీజ్ తరువాత ఎంతో గొప్ప విజయం సొంతం చేసుకోవడంతో పాటు ఏకంగా రూ. 1810 కోట్లు సొంతం చేసుకుని చరిత్ర తిరగరాసింది. 


2. బాహుబలి : (Baahubali: The Beginning)


ప్రభాస్ హెఓగా అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి సినిమా 2015లో రిలీజ్ అయి ఎంత పెద్ద సక్సెస్ కొట్టిందో అందరికీ తెలిసిందే. అంతకముందు తెలుగు సినిమా స్థాయి తక్కువగా ఉండేది. అంతే బాహుబలి సినిమా రిలీజ్ తరువాత ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు పలు సినిమా ఇండస్ట్రీ లు చూడడం విశేషం. రాజమౌళి తెరకెక్కించిన ఈ భారీ సినిమాలో ప్రభాస్ నటన కు అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ వచ్చింది. కట్టప్పగా సత్య రాజ్, దేవసేన గా అనుష్క, శివగామి గా రమ్యకృష్ణ, అలానే భల్లాల దేవుడిగా రానా దగ్గుబాటి ఎంతో ఆకట్టుకున్నారు. ఆ విధంగా విడుదలైన దాదాపుగా అన్ని కేంద్రాల్లో కూడా గొప్ప సంచలన విజయం సొంత చేసుకున్న బాహుబలి సినిమా రిలీజ్ తరువాత సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా రూ. 650 కోట్లు దక్కించుకుంది . 

బాహుబలి 2 సృష్టించిన రికార్డులు ఇప్పటికీ చెరిగిపోయేలా లేవు


3. సాహో : (Saaho)

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ నాయిక శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి సుజిత్ దర్శకత్వం వహించగా యువి క్రియేషన్స్ వారు దీనిని ఎంతో గొప్పగా భారీ స్థాయి బడ్జెట్ తో  నిర్మించడం జరిగింది. రెండేళ్ల క్రితం మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో మూవ్ సూపర్ గా సక్సెస్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు అనే చెప్పాలి. అంతకముందు బాహుబలి సినిమాల భారీ సక్సెస్ లతో ప్రపంచవ్యాప్తంగా హీరోగా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ దక్కించుకున్న ప్రభాస్ ఈ సినిమాలో తన అలరించే పెర్ఫార్మన్స్ తో అందరినీ ఎంతో ఆకట్టుకున్నారు. భారీ స్థాయి విజువల్ ఎఫెక్ట్, సాంగ్స్, అదరగొట్టే యాక్షన్ సన్నివేశాలు, హాలీవుడ్ రేంజ్ మేకింగ్, హీరోయిన్ శ్రద్ధ కపూర్ అందం ఆకట్టుకునే నటన, భారీ స్టార్ క్యాస్టింగ్ వంటివి ఈ సినిమాని సూపర్ గా సక్సెస్ చేసాయి. ఇక ఈ సినిమాని ఖర్చు పరంగా ఎక్కడా కూడా కంప్రమైజ్ కాకుండా యువి క్రియేషన్స్ వారు నిర్మించారు. ఇక ఈ సినిమా రిలీజ్ తరువాత రూ. 433 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకోవడం విశేషం. 

4. పుష్ప ది రైజ్ : (Pushpa: The Rise)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తొలిసారిగా ఆయన చేసిన పాన్ ఇండియన్ మూవీ పుష్ప ది రైజ్. ఈ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం అందుకుంది. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో కల్పలత, రావు రమేష్, సునీల్ అనసూయ భరద్వాజ్, శత్రు, ఫహాద్ ఫాసిల్ తదితరులు నటించారు. ఇక ఈ మూవీలో పుష్పరాజ్ గా ఊర మాస్ పాత్రలో అత్యద్భుతంగా నటించి అందరి నుండి ప్రసంశలు సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ఏకంగా ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు. ఇక పుష్ప 1 మూవీ దాదాపుగా అన్ని ఏరియాల్లో బాగా బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మ్ చేసింది. ఇక ఈ మూవీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 350 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకోవడం విశేషం.


5. అల వైకుంఠపురములో : (Ala Vaikunthapurramuloo)

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన అలవైకుంఠపురములో సినిమా 2020 సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ సక్సెస్ కొట్టి అల్లు అర్జున్ కెరీర్ లో అత్యద్భుత విజయాన్ని నాంధి చేయడంతో పాటు హీరోగా ఆయన రేంజ్, స్టామినా, మార్కెట్ ని విపరీతంగా పెంచింది. ఇక ఈ సినిమాకి ఎస్ థమన్ అందించిన సాంగ్స్ గురించి అయితే ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఈ సాంగ్స్ ఏకంగా నేషనల్ వైడ్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతోప్ ఆటు వీటిపై అనేకమంది స్పూఫ్ లు అలానే మ్యాష్ అప్ లు వంటివి చేసారు అంటే ఈ మూవీ సాంగ్స్ కి యువత తో పాటు శ్రోతలు అందరి నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా లో బంటు గా అల్లు అర్జున్ సూపర్ పెర్ఫార్మన్స్, పూజా హెగ్డే అందం అభినయం, అలానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్టైలిష్ మేకింగ్, అదరగొట్టే డైరెక్షన్, కామెడీ, ఫైట్స్, సాంగ్స్ వంటివి ఈ సినిమాకి ఇంత గొప్ప భారీ విజయాన్ని అందించాయి. ఇక ఈ సినిమా రిలీజ్ తరువాత ఓవరాల్ గా రూ. 272 కోట్ల కలెక్షన్ ని సొంతంక్ చేసుకుంది. 

ఆ కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు దిమ్మ తిరిగే కలెక్షన్లు వచ్చాయ్

6. సరిలేరు నీకెవ్వరు : (Sarileru Neekevvaru)

టాలీవుడ్ బడా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యంగ్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ సరిలేరు నీకెవ్వరు. యువ దర్శకుడు అనిల్ రావిపూడి తీసిన ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ నటి విజయసంతో ఒక ముఖ్య పాత్ర చేయగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. 2020 సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమాలో మహేష్ బాబు, మేజర్ అజయ్ కృష్ణ అనే రోల్ లో కనిపించగా విలన్ గా ప్రకాష్ రాజ్ నటించారు. అన్ని వర్గాల ప్రేక్షకుల తో పాటు ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ ని కూడా ఎంతో ఆకట్టుకున్న సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదల తరువాత అత్యద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి మార్క్ స్టైల్ యాక్షన్ అంశాలు, ఎంటర్టైన్మెంట్ కలగలిపి తీసిన ఈ సినిమాలో మహేష్ బాబు నటన కి అందరి నుండి విపరీతమైన రెస్పాన్స్ లభించింది. విడుదల తరువాత దాదాపుగా అనేక ఏరియాల్లో సూపర్ హిట్ టాక్ తో పాటు అత్యద్భుత కలెక్షన్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 260 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుని సూపర్ స్టార్ మహేష్ బాక్సాఫీస్ స్టామినా ని మరొక్కసారి రుజువు చేసింది. 

7. సైరా నరసింహారెడ్డి : (Sye Raa Narasimha Reddy)

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా ప్రత్యేక పాత్రలో ,అలానే నయనతార హీరోయిన్ గా తెరకెక్కిన అత్యద్భుత భారీ చారిత్రాత్మక పాన్ ఇండియా సినిమా సైరా నరసింహారెడ్డి. యువ దర్శకుడు సురేందర్ రెడ్డి తీసిన ఈ సినిమాలో తొలిసారిగా స్వాతంత్రోద్యమ సంగ్రామాన్ని మొదలెట్టిన తెలుగు వాడైన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలో గా మెగాస్టార్ చిరంజీవి సూపర్ గా యాక్ట్ చేసారు. అనుష్క కూడా ప్రత్యేక పాత్ర చేసిన ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా కీలక రోల్ చేయడం జరిగింది. అమిత్ త్రివేది సంగీతం అందించిన ఏ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మించారు. అయితే మెగాస్టార్ హీరోగా ఎన్నో అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీగా రిలీజైన సైరా నరసింహారెడ్డి సినిమా బాగానే సక్సెస్ అందుకుంది. కాగా దీనికి ముందు ఖైదీ నెంబర్ 150 మూవీ ద్వారా మంచి సక్సెస్ సొంతం చేసుకుని రీ ఎంట్రీ అనంతరం హీరోగా తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని మెగాస్టార్ నిరూపించుకున్నారు. ఇక తాజాగా సైరా నరసింహారెడ్డి రూపంలో మరొక హిట్ కొట్టారు. ఇక రిలీజ్ తరువాత ఈ సినిమా ఓవరాల్ గా రూ. 240 కోట్లు కలెక్షన్ దక్కించుకుంది.

8. రంగస్థలం : (Rangasthalam)

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తీసిన భారీ యాక్షన్ రస్టిక్ మూవీ రంగస్థలం 2019లో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టింది. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ మూవీ ని ఎంతో భారీ వ్యయంతో నిర్మించారు. ఇక ఈ సినిమాలో చెవిటి వాడైన చిట్టిబాబు పాత్రలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కనబరిచిన నటనకు అందరి నుండి సూపర్ గా ప్రశంసలు దక్కాయి. రామ లక్ష్మి గా సమంత, రంగమ్మత్త గా అనసూయ, ప్రెసిడెంట్ గా జగపతి బాబు, ఇలా అందరూ కూడా సినిమాలో తమ నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు అనే చెప్పాలి. విడుదల తరువాత దాదాపుగా అనేక కేంద్రాల్లో సూపర్ కలెక్షన్ ని సొంతం చేసుకున్న ఈ రంగస్థలం సినిమా రామ్ చరణ్ కెరీర్ లో ఒక పెద్ద మెయిలు రాయి అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా రిలీజ్ తరువాత ఓవరాల్ గా రూ. 226 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకోవడం విశేషం. 

9. భరత్ అనే నేను : (Bharat Ane Nenu)

టాలీవుడ్ స్టైలిష్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన స్టైలిష్ పొలిటికల్ యాక్షన్ మూవీ భరత్ అనే నేను. బాలీవుడ్ నటి కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ గా కనిపించగా తమిళ నటుడు  శరత్ కుమార్, టాలీవుడ్ సీనియర్ నటి ఆమనీ మహేష్ బాబు తల్లితండ్రులుగా కనిపిస్తారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో మహేష్ బాబు, ముఖ్య మంత్రి పాత్ర చేయగా ఆయనకు పీఏ పాత్రలో విలక్షణ నటుడు బ్రహ్మాజీ కనిపిస్తారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ, సమాజంలో ప్రధాన సమస్యలపై భరత్ అనే యువ ముఖ్యమంత్రి ఏ విధంగా తగు చర్యలు తీసుకుని సిస్టం ని మరింతగా ప్రజలకు అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నించాడు అనే కథాంశంతో దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాని ఎంతో గొప్పగా తీసి అందరి నుండి ప్రశంసలు అందుకున్నారు. ఇక ముఖ్యమంత్రి గా సూపర్ స్టార్ మహేష్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా విడుదల తరువాత భారీ సక్సెస్ కొట్టి ప్రపంచవ్యాప్తంగా రూ. 225 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుంది. 

ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన టాప్ 10 మూవీస్ లిస్టు ఇది


10. అత్తారింటికి దారేది : (Atharintiki Daaredi)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మతాల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యంలో తెరకెక్కిన సినిమా అత్తారింటికి దారేది. గ్రాండ్ లెవెల్లో ప్రతిష్టాత్మకంగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ పై ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాలో సమంత రూత్ ప్రభు హీరోయిన్ గా నటించగా అందాల నటి ప్రణీత ఒక కీలక పాత్ర చేసింది.. కోట శ్రీనివాసరావు, బోమన్ ఇరానీ, నదియా, ప్రదీప్ మాచిరాజు, బ్రహ్మానందం, తదితరులు ఇతర పాత్రలు చేసిన ఈ సినిమాలో పవర్ స్టార్ అద్భుత నటన తో పాటు హీరోయిన్ గా నటించిన సమంత తన ఆకట్టుకునే అందం, అభినయంతో అందరినీ అలరించారు అనే చెప్పాలి. మంచి యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తన మార్క్ తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్లుగా సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించి భారీ సక్సెస్ సొంతం చేసుకున్నారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇక 2013లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 187 కోట్ల కలెక్షన్ ని సొంతం చేసుకుని పవర్ స్టార్ స్టామినా ని రుజువు చేసింది. 


11. మహర్షి : (Maharshi)

సూపర్ స్టార్ మహేష్ హీరోగా మున్నా సినిమా తో దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన వంశీ పైడిపల్లి తెరకెక్కించిన యాక్షన్ కం ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ మహర్షి. మహేష్ బాబు ఈ సినిమాలో సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈఓ గా కనిపించగా హీరోయిన్ గా పూజా హెగ్డే నటించింది. పేద స్థాయి నుండి తన కష్టంతో టాలెంట్ తో పైకెదిగిన రిషి, ఆపైన తన ప్రాణ స్నేహితుడు కోసం ఏమి చేసాడు అనే కథాంశంతో పాటు చివర్లో రైతుల సమస్యలను కూడా ప్రస్తావిస్తూ దర్శకుడు వంశి పైడిపల్లీ ఈ సినిమాని అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా ఎంతో గొప్పగా తీశారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ప్రాణ స్నేహితుడిగా అల్లరి నరేశ్ కనిపించగా జగపతి బాబు విలన్ పాత్ర చేసారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చ్చేసిన ఈ మూవీ మహేష్ బాబు కెరీర్ లోని ప్రతిష్టాత్మక 25వ మూవీగా గ్రాండ్ గా రూపొంది రిలీజ్ అనంతరం పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది.. ఇక మహర్షి ఓవరాల్ గా విడుదల తరువాత రూ. 184 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకోవడం విశేషం. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow