Allu Arjun Birthday Special 2025: Fans Celebrations
Celebrate Allu Arjun’s birthday 2025 with fan events, unseen pics & messages.

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇటీవల సుకుమార్ తీసిన పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప 2 ది రూల్ ఆడియన్స్ ముందుకి వచ్చి ఎంతో పెద్ద బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీలో మరొక్కసారై పుష్ప రాజ్ గా తన అద్భుత నటనతో అందరినీ అలరించారు హీరో అల్లు అర్జున్.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈమూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ గా నిర్మించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతం అందించారు. ఆయనతో కలిసి కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సి ఎస్ దీనికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూర్చారు.
అల్లు అర్జున్ పుట్టినరోజు స్పెషల్ 2025
అయితే రిలీజ్ అనంతరం అనేక ఏరియాల్లో కలెక్షన్స్ ప్రభంజనం సృష్టించిన పుష్ప 2 మూవీ అటు హిందీలో సైతం అదరగొట్టింది. ముఖ్యంగా నార్త్ లో అత్యధిక నెట్ కలెక్షన్ సొంతం చేసుకున్న మూవీగా పుష్ప 2 నిలిచింది. ఇక అంతకముందు పుష్ప 1 మూవీలో అద్భుత నటనకు గాను ఏకంగా భారత ప్రభుత్వం నుండి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్.
దానితో ఆయనకు నేషనల్ వైడ్ గా అలానే విదేశాల్లో సైతం విపరీతంగా క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా పుష్పరాజ్ అనే పాత్ర సాధారణ ఆడియన్ సహా అందరికి ఎంతో చేరువైంది. అయితే దీని అనంతరం ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక మూవీ అలానే అట్లీ కుమార్ తో మరొక మూవీ లైన్లో పెట్టారు అల్లు అర్జున్.
అభిమానుల వేడుకలు
ఈ రెండు సినిమాల్లో ఇటీవల అట్లీ మూవీ యొక్క అనౌన్స్ మెంట్ ని ఒక గ్లింప్స్ టీజర్ ద్వారా అందించారు. అయితే ఆ గ్లింప్స్ ని బట్టి చూస్తే వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ లో రూపొందనున్న AA 22 వర్కింగ్ టైటిల్ మూవీ హాలీవుడ్ రేంజ్ లో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీని కోలీవుడ్ ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనుండగా యువ సంగీత తరంగం సాయి అభ్యంకర్ సంగీతం సమకూర్చనున్నారు.
అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్, అట్లీ ల AA 22 మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ జులై చివరి నుండి జరుగనుందట. ఇప్పటికే ఈ సినిమాలోని తన పాత్ర కోసం పూర్తిగా మేకోవర్ పరంగా సిద్ధమవుతున్నారు ఐకాన్ స్టార్. అయితే అసలు విషయం ఏమిటంటే, ప్రతి ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా తన పుట్టినరోజుని ఫామిలీ మధ్యన సింపుల్ గా జరుపుకున్నారు అల్లు అర్జున్.
అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్
అదే రోజున అట్లీయే మూవీ యొక్క అనౌన్స్ మెంట్ రావడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక ఆయన బర్త్ డే రోజున పలువురు ఫ్యాన్స్ రక్తదానం, అన్నదానం వంటి పలు సేవా కార్యక్రమాలను అనేక చోట్ల నిర్వహించారు.
అలానే ఇకపై తమ హీరో చేయనున్న ప్రతి మూవీ మరింత భారీ విజయం అందుకుని గ్లోబల్ గా ఆయన మరింతగా దూసుకెళ్లాలని ఫ్యాన్స్ అభిలషించారు. కాగా అట్లీ మూవీ అనంతరం త్రివిక్రమ్ మూవీ ఉంటుందని, దాని అనంతరమే సుకుమార్ తో పుష్ప 3 మూవీని అల్లు అర్జున్ చేయనున్నారని తెలుస్తోంది.
What's Your Reaction?






